Chandra Mohan Assets: చంద్రమోహన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఒక్క ఇంటి వ్యాల్యూనే 200 కోట్లా!
ఏమాత్రం అంచనాలు లేకుండానే చిత్ర పరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లను చూపించి చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రముఖ నటుడు చంద్రమోహన్. ఆరంభంలోనే హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించారు.
అలా దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంలో తనదైన ముద్రను వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ దిగ్గజ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులు గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి!

చంద్రమోహన్ కన్నుమూత: దాదాపు ఐదు దశాబ్దాలకు పైగానే తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటుడు చంద్రమోహన్.. గుండెపోటు కారణంగా శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

పరిశ్రమ మొత్తం నివాళి: దిగ్గజ నటుడిగా పేరొందిన చంద్రమోహన్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలువురు పెద్ద స్టార్లు, ఇతర నటీనటులు చంద్రమోహన్ పార్థీవ దేహానికి నివాళులు కూడా అర్పించారు.
అలా ఎంట్రీ.. 950కి పైగా: 1966లో వచ్చిన 'రంగుల రాట్నం' అనే సినిమా ద్వారా వెండితెరపైకి చంద్రమోహన్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన సుమారు 930కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. అందులో హీరోగా సుమారు 175 సినిమాలకు పైగా చేశారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారానే ఆయన ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. తద్వారా ఎన్నో అవార్డులను అందుకున్నారు.

ఆస్తులు కూడా భారీగానే: 50 సంవత్సరాలకు పైగా నట ప్రస్థానంలో 930కు పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్‌కు పేరు ప్రఖ్యాతలు బాగానే వచ్చాయి. అదే సమయంలో ఆయన ఎన్నో విలువైన ఆస్తులను సైతం కూడగట్టుకున్నారు. చంద్రమోహన్‌కు హైదరాబాద్‌తో పాటు చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు సినీ వర్గాల ద్వారా తెలిసింది.
ఇంటి విలువే 200 కోట్లు: సీనియర్ నటుడు చంద్రమోహన్ కెరీర్ మొదలెట్టిన కొత్తలోనే చాలా ప్రాంతాల్లో ఆస్తులు కూడగట్టుకున్నారు. ఈ క్రమంలోనే చెన్నై నగరంలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. అప్పుడు చాలా తక్కువ మొత్తం రేటుకే దాన్ని తీసుకున్నారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆ ఇంటి విలువ ఏకంగా రూ. 200 కోట్లు వరకూ ఉంటుందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మొత్తం ఆస్తి ఎంతంటే: దిగ్గజ నటుడు చంద్రమోహన్‌కు ప్రస్తుతం రూ. 350 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. అందులో ఇద్దరు కూతుళ్లకు సమానంగా కొంత భాగాన్ని పంచేశారట. మిగిలిన ఆస్తులను మాత్రం తన పేరు మీదనే ఉంచుకున్నారని తెలిసింది. చంద్రమోహన్ ఆస్తులను తన తదనంతరం ఎవరికి దక్కేలా వీలునామా రాశారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











