ఛార్మీతో విజయ్ దేవరకొండ రైడ్.. పిక్స్ వైరల్
ఛార్మీ, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ అందరూ ఇప్పుడు లైగర్ సెట్‌లో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఛార్మీ సెట్‌లో ఉంటే అక్కడి వాతావరణంలో ఎంతో మార్పు వస్తుంది. అందరిలోనూ ఉత్సహాన్ని పెంచుతూ సందడి చేస్తుంటుంది. అలా తాజాగా లైగర్ సెట్‌లో అందరిలోనూ నవ్వులు విరిసేలా చేసింది. తాజాగా విజయ్ దేవరకొండను స్కూటీ ఎక్కించుకుని షికారుకు వెళ్లింది.
అయితే ఛార్మీపైన విజయ్‌కి బాగానే నమ్మకం ఉందట. విజయ్‌కి నా మీద బోలెడంత నమ్మకం ఉందనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు.. లైగర్ సెట్స్ షూటింగ్ జరుగుతుండగా వచ్చిన గ్యాప్‌లో ఇలా షికార్లు చేస్తున్నామంటూ ఛార్మీ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో విజయ్ వెనకాల కూర్చుని ఉంటే.. ఛార్మీ స్కూటీని నడుపుతోంది. ఇక వెనకాల పూరి జగన్నాథ్ కూడా లైట్‌గా కనిపిస్తున్నాడు.

అయితే అందులో అందరూ మాస్కులు పెట్టుకునే ఉన్నారు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ఇలా అందరూ కూడా నిబంధనలు పాటించారు. ప్రస్తుతం లైగర్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయాలని పూరిఫిక్స్ అయ్యాడు. అందుకే గ్యాప్ లేకుండా చకచకా కానిచ్చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే లైగర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించేశాడు. సెప్టెంబర్ 9న లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతంది.


Click it and Unblock the Notifications











