Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బు చూసి కళ్లల్లో మెరుపులు... చార్మీ కెరీర్లో అరుదైన రోజు
సినిమా చరిత్రలో హీరోయిన్ చార్మీ కౌర్‌ది సుదీర్ఘమైన ప్రయాణమనే చెప్పవచ్చు. చిన్నతనంలోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చార్మీ ఎన్నో విజయాలను, ఎన్నో పరాజయాలను చవిచూశారు. మే 27వ తేదీకి నా కెరీర్ 18 ఏళ్లు నిండాయి అంటూ చార్మీ ఉద్వేగపూరిత అంశాలను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. తన సినీ ప్రయాణాన్ని గురించి వెల్లడిస్తూ..
మే 27న కెమెరా ముందుకు వచ్చా
సరిగ్గా 27 మే 2001 అంటే 18 ఏళ్ల క్రితం నా సినీ ప్రయాణం మొదలైంది. నా జీవితంలో కెమెరా ముందు నటించడం ఆ రోజే తొలి అనుభవం. కెమెరా ముందు నేను ఒక్కరినే లేను. నాతోపాటు మరో 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, కొందరు బాలీవుడ్ స్టార్లు ఉన్నారు. అప్పడు నాకు సినీ రంగం మరో ప్రపంచంలా కనిపించింది అంటూ చార్మీ పేర్కొన్నారు.
ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో
నాకు ఇంకా ఆ రోజు గుర్తు ఉంది. నా స్కూల్ డేస్‌లో షూటింగ్‌కు పంపుతామని నా తల్లిదండ్రులు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఒకటే రోజు షూటింగ్‌కు వెళ్లాలి. ఆ తర్వాత తిరిగి వచ్చి స్కూల్‌కు పోవాలనే వారి మాటలు ఇంకా మరిచిపోలేను. నా సోదరుడు నా చేయి పట్టుకొని ముంబైలోని మెహబూబ్ స్టూడియోకు తీసుకెళ్లిన క్షణాలు ఎలా మరిచిపోగలను అని చార్మి తన తొలి రోజు షూటింగ్ అనుభవాన్ని పంచుకొన్నారు.
నా పారితోషికం రూ.200
నా తొలి రోజు షూటింగ్ జీవితంలో మరిచిపోలేని సంఘటన. ఆ రోజు షూటింగ్లో పాల్గొన్నందుకు రూ.200 ఇచ్చారు. నా తొలి సంపాదన చూసి కళ్లు మెరిశాయి. నా కలలకు, ఆశలకు అప్పడే బీజం పడింది. ఆ సమయంలోనే నేను హీరోయిన్ కావాలని అనుకొన్నాను. అప్పటి నుంచి నా కలలకు నా కుటుంబం అండగా నిలిచింది అని ఛార్మీ వెల్లడించింది.
18 ఏళ్లుగా వెనుకకు చూసుకోలేదని
మే 27, 2001 రోజున మొదలైన నా ప్రయాణం జెట్ స్పీడ్‌తో సాగింది. ఆ రోజు నుంచి ఎప్పడూ వెనుకకు తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ నా కథ బ్రహ్మండంగా సాగుతున్నది. నటిగా ప్రారంభమైన నా జీవితం నిర్మాతగా మార్చింది. నేను నిర్మించే ఇస్మార్ట్ శంకర్ చిత్రం జూలై 12న రిలీజ్ కాబోతున్నది. మీ అందర్ని ఆ సమయంలో నేను కలుసుకొంటాను అని చార్మీ సోషల్ మీడియాలో వెల్లడించింది.
Celebrating 18 years in cinema 💪🏻😍 #grateful 🙏🏻 ❣️🥰😘🥳 pic.twitter.com/FuagtMgRF9
— Charmme Kaur (@Charmmeofficial) May 27, 2019