twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బు చూసి కళ్లల్లో మెరుపులు... చార్మీ కెరీర్‌లో అరుదైన రోజు

    |

    సినిమా చరిత్రలో హీరోయిన్ చార్మీ కౌర్‌ది సుదీర్ఘమైన ప్రయాణమనే చెప్పవచ్చు. చిన్నతనంలోనే హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చార్మీ ఎన్నో విజయాలను, ఎన్నో పరాజయాలను చవిచూశారు. మే 27వ తేదీకి నా కెరీర్ 18 ఏళ్లు నిండాయి అంటూ చార్మీ ఉద్వేగపూరిత అంశాలను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. తన సినీ ప్రయాణాన్ని గురించి వెల్లడిస్తూ..

     మే 27న కెమెరా ముందుకు వచ్చా

    మే 27న కెమెరా ముందుకు వచ్చా

    సరిగ్గా 27 మే 2001 అంటే 18 ఏళ్ల క్రితం నా సినీ ప్రయాణం మొదలైంది. నా జీవితంలో కెమెరా ముందు నటించడం ఆ రోజే తొలి అనుభవం. కెమెరా ముందు నేను ఒక్కరినే లేను. నాతోపాటు మరో 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, కొందరు బాలీవుడ్ స్టార్లు ఉన్నారు. అప్పడు నాకు సినీ రంగం మరో ప్రపంచంలా కనిపించింది అంటూ చార్మీ పేర్కొన్నారు.

    ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో

    ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో

    నాకు ఇంకా ఆ రోజు గుర్తు ఉంది. నా స్కూల్ డేస్‌లో షూటింగ్‌కు పంపుతామని నా తల్లిదండ్రులు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఒకటే రోజు షూటింగ్‌కు వెళ్లాలి. ఆ తర్వాత తిరిగి వచ్చి స్కూల్‌కు పోవాలనే వారి మాటలు ఇంకా మరిచిపోలేను. నా సోదరుడు నా చేయి పట్టుకొని ముంబైలోని మెహబూబ్ స్టూడియోకు తీసుకెళ్లిన క్షణాలు ఎలా మరిచిపోగలను అని చార్మి తన తొలి రోజు షూటింగ్ అనుభవాన్ని పంచుకొన్నారు.

     నా పారితోషికం రూ.200

    నా పారితోషికం రూ.200

    నా తొలి రోజు షూటింగ్ జీవితంలో మరిచిపోలేని సంఘటన. ఆ రోజు షూటింగ్‌లో పాల్గొన్నందుకు రూ.200 ఇచ్చారు. నా తొలి సంపాదన చూసి కళ్లు మెరిశాయి. నా కలలకు, ఆశలకు అప్పడే బీజం పడింది. ఆ సమయంలోనే నేను హీరోయిన్ కావాలని అనుకొన్నాను. అప్పటి నుంచి నా కలలకు నా కుటుంబం అండగా నిలిచింది అని ఛార్మీ వెల్లడించింది.

    18 ఏళ్లుగా వెనుకకు చూసుకోలేదని

    18 ఏళ్లుగా వెనుకకు చూసుకోలేదని

    మే 27, 2001 రోజున మొదలైన నా ప్రయాణం జెట్ స్పీడ్‌తో సాగింది. ఆ రోజు నుంచి ఎప్పడూ వెనుకకు తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ నా కథ బ్రహ్మండంగా సాగుతున్నది. నటిగా ప్రారంభమైన నా జీవితం నిర్మాతగా మార్చింది. నేను నిర్మించే ఇస్మార్ట్ శంకర్ చిత్రం జూలై 12న రిలీజ్ కాబోతున్నది. మీ అందర్ని ఆ సమయంలో నేను కలుసుకొంటాను అని చార్మీ సోషల్ మీడియాలో వెల్లడించింది.

    English summary
    Actress Charmme Kaur celebrating 18 years of Cinema. He has been started her career on May 27, 2001 in Mumbai's Mehaboob Studio. She recollected her first remunaration Rs. 200 for first day shoot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X