నేను నీకేం చేశానని అలా చేశావ్.. ఆ పనికి మూగబోయాను.. అభిమాని చర్యకు ఛార్మీ ఎమోషనల్
అభిమానానికి హద్దులుండవ్. అది హీరో అయినా హీరోయిన్ అయినా ఇంకెవరైనా సరే.. వారిపై చూపించే ప్రేమలో ఏ మాత్రం తేడా ఉండదు. వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ఫ్యాన్స్. ప్రతీ హీరోకూ తమ తమ ఫ్యాన్స్ ఉంటారు. తమ హీరోలే ఫ్యాన్స్‌కు గ్రేట్‌గా కనిపిస్తారు. కొన్ని సార్లు అభిమానుల చర్యలు హీరో, హీరోయిన్లకు నోటమాట రానీయకుండా చేసేస్తుంది. ప్రస్తుతం ఛార్మీకి కూడా అలాంటి స్థితే ఎదురైంది. సదరు అభిమాని చేసిన పనికి ఛార్మీ మూగబోయింది. ఆ అభిమాని చూపించిన ప్రేమకు ముగ్దురాలైంది. ఇంతకీ అసలు విషయం ఏంటో ఓ సారి చూద్దాం.

పచ్చబొట్టుతో ప్రేమ..
పచ్చబొట్టును పొడిపించుకుని తమ ప్రేమను చాటి చెబుతుంటారు ఫ్యాన్స్. ఎంత ప్రేమ ఉందో చూపించేందుకు అదో మార్గంగా ఎంచుకుంటారు. అయితే కొంతమంది హీరో, హీరోయిన్లు మాత్రం అలాంటి పనులను ప్రోత్సహించరు. అలాంటి పనులు చేయకండని ఫ్యాన్స్‌ను వేడుకుంటారు.

ఛార్మీ పుట్టిన రోజున..
ఛార్మీ పుట్టిన రోజున (మే 17) సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం హీరోయిన్‌గా ఒక్క ప్రాజెక్ట్ చేయకపోయినా.. ఛార్మీ క్రేజ్ మాత్రం తగ్గనేలేదు. ఈ విషయం ఆమె బర్త్ డే నాడు సోషల్ మీడియాలో జరిగిన హల్చల్ చూస్తూనే అర్థమవుతుంది. ఆమె పుట్టిన రోజు కానుకగా ఓ అభిమాని జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడట. అదేంటో ఓ సారి చూద్దాం.

ఛార్మీ పేరును పచ్చబొట్టుగా..
ఛార్మీ కౌర్ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడో అభిమాని. అంతేకాకుండా ఓ రెండు జుట్టు పిలకలు, అద్దాలు పెట్టుకున్న ఓ బొమ్మను కూడా వేయించుకున్నాడు. ఇక ఈ పచ్చబొట్టును, ఆ బొమ్మను చూసి ఛార్మీ తెగ మురిసిపోయింది. ఆ అభిమాని చూపించిన ప్రేమకు ఎమోషనల్ అయింది.

మాటలు రావడం లేదు.
ఆ పచ్చబొట్టుపై స్పందిస్తూ.. ‘ప్రభాకర్.. మాటలు రావడం లేదు.. మూగబోయాను.. నా పుట్టిన రోజున నాకు బహుమతిగా నా పేరును టాటూగా వేయించుకున్నావ్.. అది శాశ్వతమైంది.. నీతోనే జీవితాంతం ఉంటుంది.. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు..

నీకేం చేశానని..
నేను నీకేం ఏం చేశానని.. నీవు ఈ పని చేశావ్.. ఇంత ప్రేమను చూపిస్తున్నావ్.. నీవు కురిపించిన ఈ అపరిమితమైన ప్రేమను తిరిగి నీకు ఎలా ఇవ్వగలను. ఆ టాటూలో మాదిరిగా నేను ఏదో ఒక రోజు మేకప్ వేసుకుంటాను. షార్ట్ హెయిర్, గ్లాసెస్‌తో కూడిన ఆ డిజైన్ నచ్చింది. నీవు చూపించిన ప్రేమకు మిలియన్ థ్యాంక్స్' అని పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











