100 మంది చెన్నై హార్బర్ శ్రామికులకు కూలీ ప్రదర్శన.. వన్ఇండియా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈవెంట్‌పై భారీగా ప్రశంసలు

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం పంద్రాగస్టు కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నాగార్జున అక్కినేని, సౌబీన్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్ నటించిన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూసిన ఈ సినిమాను సామాజిక బాధ్యతగా చేపట్టిన ఓ కార్యక్రమంలో దేశంలోనే టాప్ మల్టీ లింగ్వల్ వెబ్ పోర్టల్ వన్ ఇండియా తొలిసారి భాగమైంది. రియల్ లైఫ్‌ హీరోలను రీల్ లైఫ్‌ను కలిపే సామాజిక బాధ్యతతో చొరవ తీసుకొన్నది. చెన్నై హార్బర్ కూలీలకు, వన్ ఇండియా రీడర్లు దాదాపు 150 మందికి ఈ సినిమాను చెన్నైలోని సత్యం థియేటర్‌‌లో సోమవారం (ఆగస్టు 18వ తేదీ) సాయంత్రం ప్రదర్శించారు. వన్ ఇండియా చేపట్టిన ఈ కార్యక్రమం వివరాల్లోకి వెళితే..

రజనీకాంత్‌తోపాటు పలు భాషలకు చెందిన సూపర్ స్టార్స్ నటించిన కూలీ సినిమా థియేటర్‌లో సంచలనం రేపుతున్నది. ఈ సినిమాను చెన్నై హార్బర్‌లో పనిచేసే 100 మంది శ్రామికులకు చూపించడంతోపాటు 50 మంది తమ రీడర్లకు చూపించే బాధ్యతను వన్ ఇండియా చేపట్టింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా చెన్నై హార్బర్‌ను బిగ్ స్క్రీన్‌కు కనెక్ట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టి రియల్ లైఫ్‌కు రీల్ లైఫ్‌కు బ్రిడ్జిగా మారింది. నిజ జీవితంలో ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి శ్రమించే కూలీలకు అరుదైన గౌరవాన్ని కల్పించే బాధ్యతను వన్ ఇండియా చేపట్టిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ సినిమాపై ఓపెన్ కాంటెస్ట్‌ను నిర్వహించి ఎంపిక చేసిన 50 మంది రీడర్లకు కూడా ఈ సినిమా ప్రదర్శనకు ఎంపిక చేసి వారికి ఆనందాన్ని, గుర్తింపునే కాకుండా అరుదైన గౌరవాన్ని వన్ ఇండియా తీసుకొన్నది.

OneIndia arranges Coolie special Screening to Chennai Harbour Coolies

ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా వన్ ఇండియా సీఈవో రావణన్ ఎన్ మాట్లాడుతూ... స్క్రీన్‌పైనే కాకుండా నిజ జీవితంలో కూడా ప్రతీ రోజు అణగారిన వర్గాల వ్యధలను, కథలను చెప్పడంలో ఉండే పవర్‌ను వన్ ఇండియా బలంగా నమ్ముతుంది. ఆ క్రమంలోనే చెన్నై హార్బర్‌లోని కూలీలను, మా రీడర్లను కూలీ స్క్రీనింగ్‌లో భాగం చేయాలని భావించాం. బాహ్య ప్రపంచానికి తెలియని నిజమైన హీరోలకు గౌరవం, గుర్తింపు ఇవ్వాలని భావించాం. ఐక్యతను చాటి చెప్పే శక్తిమంతమైన సినిమాను వాస్తవ జీవితంలోని హీరోలకు చూపించి వారిలో స్పూర్తిని నింపాలని నిర్ణయం తీసుకొన్నాం. రియల్ భారత్, వాస్తవ జీవితాలను, వారు చేసే పోరాటానికి నిజమైన గౌరవం కల్పించడానికి ఈ మార్గాన్ని ఎంచుకొన్నాం అని అన్నారు.

OneIndia arranges Coolie special Screening to Chennai Harbour Coolies

కూలీ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా చెన్నై హార్బర్ శ్రామికులు, వన్ ఇండియా రీడర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వన్ ఇండియా చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించడమే కాకుండా మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిత్యం అనేక సమస్యలతో ఉండే తమకు వినోదంతోపాటు చైతన్యాన్ని కల్పించే బాధ్యతను చేపట్టినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమా స్క్రీన్ సందర్భంగా శ్రామికులు, రీడర్లు చేసిన సందడి అందర్నీ ఆకట్టుకొన్నది. వారు ఆనందంతో వేసిన కేకలు, ఈలలు, చప్పట్లతో థియేటర్ మార్మోగింది. చెన్నై హార్బర్ కార్మికులు కీలక సన్నివేశాల్లో భావోద్వేగాలకు గురయ్యారు. స్క్రీన్ పై వచ్చే సన్నివేశాలను చూసి తమ జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకొన్నామని ఈ సందర్భంగా కూలీలు తెలిపారు.

Chennai Harbour Coolies

రియల్ లైఫ్ హీరోలకు స్పూర్తిగా నిలిచే విధంగా వినోదంతోపాటు విశ్వాసం, చైతన్యం పెంపొందించే విధంగా వన్ ఇండియా వైవిధ్యమైన ఆలోచన చేసిన తీరుకు చెన్నై హార్బర్ శ్రామికులు సీఈవో రావణన్‌ను అభినందించారు. సమాజంపై ప్రబావం చూపే సినిమాలను కేవలం ప్రమోషన్స్‌‌లో భాగంగా కాకుండా సామాజిక బాధ్యతగా చేసినందుకు ప్రతీ ఒక్కరు వన్ ఇండియా చూపిన చొరవను ప్రశంసించారు. సామాజిక బాధ్యతను గుర్తు చేసే కార్యక్రమాలను చేపట్టి దైనందిక జీవితంలో రియల్ హీరోలుగా నిలిచే వారికి స్పూర్తిని కలిగిస్తామని ఈ సందర్భంగా రావణన్ అన్నారు. వన్ ఇండియా నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రామిక లోకం, వన్ ఇండియా రీడర్ల కుటుంబం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

More from Filmibeat

Read more about: oneindia coolie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X