CCL 2024 భోజ్‌పురి దబంగ్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన చెన్నై రైనోస్.. హీరో జీవా జట్టు ఘన విజయం
ఫ్రొఫెషనల్ క్రికెటర్లకు ఏ మాత్రం తగ్గకుండా సినీ తారలు తమ క్రికెట్ ప్రతిభను చాటుకొంటున్నారు. దేశంలోని వివిధ భాషల్లోని హీరోల జట్టుగా ఏర్పడి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCl)ను కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు. 2024 సంవత్సరపు ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా సీసీఎల్ 2024 ఘనంగా మొదలైంది. ఈ టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చెన్నై రైనోస్, భోజ్‌పురి దబాంగ్స్ మధ్య జరిగిన 6వ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
చెన్నై జట్టు వివరాలు:
జీవా (కెప్టెన్), అధవ్, అజయ్ రోషన్, భరత్ నివాస్, రమణ, సత్య (వికెట్ కీపర్), కళై అరసన్, పృథ్వీ, శంతను, విక్రాంత్ తదితరులు జట్టులో ఉన్నారు. ఈ మ్యాచ్‌కు హీరో ఆర్య దూరంగా ఉండటంతో కెప్టెన్సీ బాధ్యతలను జీవా చేపట్టారు.

భోజ్‌పురి దబంగ్స్ జట్టు:
మనోజ్ తివారీ (కెప్టెన్), రామ్ యాదవ్, సుధీర్ సింగ్, ఉదయ్ తివారీ, విక్రాంత్ సింగ్, ఆదిత్య ఓజా, అన్షుమన్ రాజ్‌పుత్ (వికెట్ కీపర్), దినేష్ యాదవ్, ఆస్గర్ ఖాన్, అజయ్ ఖాన్, యై ప్రకాశ్ యాదవ్ జట్టులో సభ్యులుగా ఉన్నారు.
చెన్నై రైనోస్ జట్టు టాస్ గెలిచి ఫీల్గింగ్ ఎంచుకోవడంతో భోజ్‌పురి టీమ్ బ్యాటింగ్ చేపట్టింది. కెప్టెన్ మనోజ్ తివారీ జట్టు ఇన్నింగ్స్ ఆరంభించారు. మొదటి బాల్‌ను బౌండరీకి తరలించి మంచి ఊపులో కనిపించారు. ఆ తర్వాత వెంటనే జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా తక్కువ స్కోరుకే అవుటాయ్యాడు. విక్రాంత్ విజృంభించి 5 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో భోజ్‌పురి జట్టు 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. భోజ్‌పురి తొలి 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై రైనోస్ జట్టు ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. 10 ఓవర్లలో 5 వికెట్లు కల్పోయి 92 పరుగులు చేసింది. దాంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారీగా అంటే.. 35 పరుగుల ఆధిక్యత లభించింది.
ఇక భోజ్‌పురి జట్టు రెండో ఇన్సింగ్స్‌ను జాగ్రత్తగా ఆడుతూ స్కోరును పరుగులు పెట్టించింది. నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. దాంతో 50 పరుగుల విజయలక్ష్యాన్ని చెన్నై రైనోస్ ముందు ఉంచింది. 50 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు 5.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. దాంతో చెన్నై జట్టును విజయం వరించింది.


Click it and Unblock the Notifications











