2020లో సోషల్ మీడియా హవా.. ట్విట్టర్‌లోకి మెగా ఎంట్రీ
2020లో సోషల్ మీడియాదే హవా నడిచింది. కరోనా, లాక్డౌన్ వల్ల అందరూ ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. అలా లాక్డౌన్ నడిచిన ఐదారు నెలల సమయంలో అందరూ సోషల్ మీడియాలోనే బతికేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టా అంటూ రచ్చ చేశారు. ఈ సమయంలోనే చిరంజీవి, రామ్ చరణ్, అనుష్క వంటి వారు ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ట్విట్టర్‌లో అడుగుపెట్టేందుకు వీరు సరైన ముహూర్తాన్నే ఎంచుకున్నారు.
చిరంజీవి, రామ్ చరణ్ ఒకే సమయంలో ట్విట్టర్‌లోకి అడుగుపెట్టారు. రామ్ చరణ్‌కు ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలున్నప్పటికీ ట్విట్టర్‌లో మాత్రం ఆలస్యంగా అడుగుపెట్టాడు. ఇన్నాళ్లు సోషల్ మీడయాకు దూరంగా ఉన్న చిరంజీవి ట్విట్టర్, ఇన్ స్టాలో అడుగుపెట్టాడు. వచ్చీ రావడంతోనే ట్విట్టర్‌ను ఓ ఊపు ఊపేశాడు. మొదటి నెలలో చిరు ట్విట్టర్‌ను రఫ్పాడించడం చూసి అందరూ షాక్ అయ్యారు. చిరు పెట్టే ఇమేజ్‌లు, వేసే పంచ్‌లు, షేర్ చేసే జిఫ్ ఫైల్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఇక అనుష్క శెట్టి సైతం ట్విట్టర్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టింది. అనుష్కకు ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలున్నప్పటికీ ట్విట్టర్‌లో మాత్రం ఆలస్యంగానే ఎంట్రీ ఇచ్చింది. నిశ్శబ్దం సినిమా ప్రమోషన్లకు వీలుగా ఉండేట్టు అనుష్క ట్విట్టర్‌లోకి అడుగుపెట్టింది. నిశ్శబ్దం సినిమాను బాగానే ప్రమోట్ చేస్తూ.. అభిమానులతో ట్విట్టర్‌లో లైవ్ సెషన్ పెట్టేసింది. మొదటి సారిగా అనుష్క చేసిన లైవ్ సెషన్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది.


Click it and Unblock the Notifications











