Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బెడ్పైనుంచే బట్టలు ఒక్కొక్కటిగా.. షాకింగ్‌గా చీకటి గదిలో చితక్కొట్టుడు ప్రీ టీజర్
ఓ చిన్న సినిమా అందరి దృష్టిని ఆకర్షించాలంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో ఏడాదికి కొన్ని వందల సినిమాలు వస్తుంటాయి. అందులో పెద్ద సినిమాలు పట్టుమని పది శాతం కూడా ఉండవు. కానీ చిన్న సినిమాలు మాత్రం కోకొల్లలు. అంతటి పోటీలో నిలిచి గెలిచేవి, జనాలను ఆకర్షించేవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. అలా గతేడాది కొన్ని అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన కొన్ని సినిమాలు సోషల్ మీడియాను ఊపేశాయి.
బోల్డ్ కాన్సెప్ట్‌తో..
బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సినిమాలు జనాల దృష్టిని సులభంగా ఆకర్షిస్తాయి. ఈ క్రమంలోనే గతేడాది డిగ్రీ కాలేజ్, ఏడు చేపల కథ, చీకటి గదిలో చితక్కొట్టుడు వంటి చిత్రాలు దాడి చేశాయి. టీజర్, ట్రైలర్‌తో కాక పుట్టించేస్తారు. సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తారు. సినిమా కాసింత బాగుందన్న టాక్ వస్తే చాలు వారు సక్సెస్ అయినట్టే.
చితక్కొట్టుడు సీక్వెల్..
చీకటి గదిలో చితక్కొట్టుడు అనే చిత్రం ఓ మోస్తరుగా పర్వాలేదనిపించింది. సినిమాపై బాగానే బజ్ ఏర్పడంతో కలెక్షన్లు కూడా ఫుల్లుగా వచ్చాయి. అందుకే చితక్కొట్టుడు డోస్ పెంచి సీక్వెల్ తీశారు. ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు.
రచ్చ చేసిన నిక్కీ..
చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో నిక్కీ తంబోలి చేసిన రచ్చ యూత్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో చేసిన విచ్చలవిడి అందాల ఆరబోతకు మంచి క్రేజ్ వచ్చింది. అలా బిగ్ బాస్ ఆఫర్‌ను కూడా కొట్టేసింది. హిందీ బిగ్ బాస్ 14వ సీజన్లో నిక్కీ తంబోలి నానా రచ్చ చేస్తోంది.
ప్రీ టీజర్లోనే మెలిక..
రేపు ఉదయం పదకొండు గంటలకు రాబోతోన్న ఈ టీజర్ ఎలా ఉండబోతోందో శాంపిల్‌గా ఓ చిన్న వీడియోను వదిలారు. ఈ ప్రీ టీజర్‌తోనే ఎంతో హీటెక్కించాడు. ఓ రూంలో నుంచి అమ్మాయి బట్టలు ఒక్కొక్కటి బయటపడుతుంటాయి. లోదుస్తులతో సహా బయటకు వస్తుంటాయి. తీరా లోపలికి వెళ్తే. బెడ్ పై నుంచి కుక్కు పిల్ల ఆ బట్టలన్నీ విసిరిపారేస్తుంది. ఏదో ఉంటుందని ఊహించిన వారు షాక్ అయ్యేలా ఆ బుజ్జి కుక్కపిల్లా ఎగతాళి చేస్తూ ఉంటుంది. మొత్తానికి రేపు మాత్రం చితక్కొట్టుడు టీజర్ రచ్చ చేసేలానే కనిపిస్తోంది.