Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇది మరీ దారుణం.. హద్దులు దాటిన డైలాగ్‌లు, సీన్లు.. ‘చితక్కొట్టుడు’ టీజర్ రచ్చ
చిన్న సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలి.. హిట్ కొట్టాలి.. డబ్బులు సంపాదించాలనే కాన్పెప్ట్‌తో కొందరు హద్దులు దాటుతున్నారు. బోల్డ్ కంటెంట్‌ను నమ్ముకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు బజ్ మాత్రమే క్రియేట్ చేయగలిగాయి. కానీ ఏ ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయలేదు. అలాంటిది గతేడాది వచ్చిన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేశారు. తాజాగా దానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.
వెరైటీ ప్రమోషన్స్..
నేడు టీజర్ విడుదల కానుందని చెబుతూ.. నిన్న శాంపిల్‌గా ఓ ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఓ రూంలో నుంచి అమ్మాయి బట్టలు ఒక్కొక్కటి బయటపడుతుంటాయి. లోదుస్తులతో సహా బయటకు వస్తుంటాయి. తీరా లోపలికి వెళ్తే. బెడ్ పై నుంచి కుక్కు పిల్ల ఆ బట్టలన్నీ విసిరిపారేస్తుంది. ఇలా ప్రీ టీజర్లోనే ఎంతో ఊరించిన చిత్రయూనిట్ టీజర్‌తో రచ్చ చేసింది.
బోల్డ్ డైలాగ్‌లతో..
టీజర్ ప్రారంభంలోనే హెడ్ సెట్ పెట్టుకుని టీజర్ వినమని హెచ్చరించారు. మాస్క్ మాత్రమే కాదు.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి హెచ్చరించారంటే డైలాగ్‌లు ఎలా ఉండబోతోన్నాయో అర్థం చేసుకోండి. షార్ట్ స్టోరీ షాట్ స్టోరీ అంటూ టీజర్ ప్రారంభంలోనే డబులో మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోయారు.
హద్దులు దాటేసిన డైలాగ్‌లు..
మందైనా సరే హ్యాండ్ అయినా సరే ఓవర్ కొడితేనే అంటూ అర్జున్ రెడ్డి స్టైల్లో చేతిని ఊపుతూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ ఓ రేంజ్లో ఉంది. అది మామూలు దెయ్య కాదు దేశాన్నే... దెయ్యం అంటూ బీప్ సౌండ్లు లేకుండా పచ్చిగా మాట్లాడేశారు. ప్రేమ పిశాచి కామ పిశాచి.. సైట్ కొట్టడం సైజ్ చూసి కొట్టడం వంటి బోల్డ్ డైలాగ్‌లతో టీజర్ రచ్చ రచ్చగా మారింది.
శ్రుతిమించిన శృంగారం..
చితక్కొట్టుడు 2లో హీరోయిన్లు బాగానే అందాలను ఆరబోసినట్టు కనిపిస్తోంది. అడ్డూ అదుపూ లేకుండా అందాలను విచ్చల విడిగా ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. రెచ్చిపోయి మరీ రొమాంటిక్ సీన్లలో నటించినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా టీజర్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.