ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. 80కిపైగా చిత్రాల్లో మెరిసిన నటి సక్సెస్ స్టోరీ..!
హెచ్ఎస్ కీర్తన.... ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. నటిగా ఆడియెన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా ఉన్నత స్థాయి అధికారిగా ప్రజల కష్టాలను తీర్చుతున్నది హెచ్ఎస్ కీర్తన. కృషి ఉంటే మనుషులు బుుషులవుతారోయో.. అని అన్నగారు చెప్పిన చెప్పిన మాటలు ఆమె ఉదాహరణగా మారింది. యాక్టింగ్ లో కెరీర్ బ్రహ్మాండగా కొనసాగుతున్న సమయంలో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి కలెక్టర్ గా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
యూపీఎస్సీ ఎగ్జామ్ ఎంత కఠినతరమైనదో తెలిసిందే. దేశంలోనే అత్యంత పోటీ ఉన్న పరీక్ష కూడా ఇదే. ప్రతి ఏడాది కొన్ని వేల మంది ఈ పోటీ పరీక్షకు హాజరవుతుంటారు. కానీ కొంది మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించి, ఇంటర్వ్యూల్లో నెగ్గి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా మారుతారు. అది చెప్పినంత సులువైనా పనికాదు. యూపీఎస్సీని దాటలంటే ఎన్నో ఏళ్ల కష్టం, ఎంతో పట్టుదల, హై స్కిల్స్ ఉండటం అత్యవసరం. పైగా ఇతర వ్యాపాకాలేమీ ఉండకూడదు. అలాగైతే నే సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించే ఛాన్స్ ఉంటుంది.

అలాంటిది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అది కూడా ఒక మహిళ.. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ గా మారిందంటే నమ్మడం కష్టమే.. కానీ ఇది అక్షర సత్యం. ఆమె 32 చిత్రాలు, 48 టీవీ సీరియల్స్ లో నటించి ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. ఆమెనే హెచ్ఎస్ కీర్తన. ఆమె మన తెలుగు నటి కాదు. కానీ ఆమె జీవితం ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వారికి ఎలాంటి స్కిల్స్ ఉండవని చెప్పే రోజుల్లో... ఫిల్మ్ కెరీర్ లో బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకుని ఆ తర్వాత కలెక్టర్ గా ఎంపికైందీ హెచ్ఎస్ కీర్తన. దీంతో ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడే వారికి గతంలోనే సమాధానం ఇచ్చింది.
హెచ్ కీర్తన కన్నడ నటి... ఆమె కర్పూరద గొంబే, గంగా-యమునా, ముద్దిన అలియా, ఉపేంద్ర, ఎ, కానూరు హెగ్గదాటి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఓ మల్లిగే, లేడీ కమీషనర్, హబ్బా, డోరే, సింహాద్రి, జనని, చిగురు, మరియు పూతని ఏజెంట్ వంటి చిత్రాల్లో బాలనటిగా నటించి మెప్పించింది. మొత్తం 32 చిత్రాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించింది. అలాగే 48 టీవీ షోస్ లో మెరిసింది. ఆమె నటించిన చిత్రాల్లో చాలా వరకు సూపర్ హిట్ కావడం విశేషం. నేషనల్ అండ్ స్టేట్ అవార్డ్స్ ను కూడా అందుకుందని తెలుస్తోంది. అలా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నటనకు గుడ్ బై చెప్పారు కీర్తన.
తన తండ్రి ఆశయం మేరకు యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణురాలై కలెక్టర్ గా మారారంట హెచ్ఎస్ కీర్తన. తన 15వ ఏట వరకు కూడా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె కెరీర్ పరంగా యాక్టివ్ గా ఉన్నారు. ఆ తర్వాత స్టడీస్ పై శ్రద్ధ వహించారు. యూపీఎస్సీకి వెళ్లేకంటే ముందే కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (KAS) ఎగ్జామ్ 2011లో ఉత్తీర్ణత సాధించింది. రెండేళ్ల పాటు కేఏఎస్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు.
ఇక కీర్తన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఐదేళ్లకు యూపీఎస్సీ క్రాక్ చేసింది. ఐదు సార్లు నిరాశ చెందిన ఆమె ఆరోసారికి 167వ ర్యాంక్ తో యూపీఎస్సీ క్లియర్ చేసింది. ఆమె మొట్టమొదటగా కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో అసిస్టెంట్ ఆఫీసర్ గా సేవలందించారు. ప్రస్తుతం చిక్కమంగళూరు జిల్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అలా నటిగా విజయం సాధించడమే కాకుండా.. దేశంలోనే అత్యంత కఠినతరమైన పోటీ పరీక్ష యూపీఎస్సీని క్లియర్ చేయడం వెనుక హెచ్ఎస్ కీర్తన పట్టుదల, కృష్టి ఎందరికో ఆదర్శం.


Click it and Unblock the Notifications











