twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యా, అంకుల్ అంటూ గట్టిగా ఇచ్చింది.. ‘శక్తిమాన్’పై చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

    |

    సినీ రంగాన్ని మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ ఎంతగా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం ఇండియాలో తను శ్రీ దత్తాతో ఊపందుకుంది. నానా పటేకర్ లాంటి పెద్ద నటుడిపై తను శ్రీ దత్తా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆ తరువాత దక్షిణాదిన ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చింది మాత్రం సింగర్ చిన్మయి శ్రీపాద. ఇప్పటికే మీటూ ఉద్యమంపై పోరాడుతూనే ఉంది.

    ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలు..

    ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలు..

    ఇలా ఓ వైపు మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే కొందరు చేసే వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. మీటూ కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు అంతటా ఉంటుంది. కామన్ అంటూ కొందరు అంటారు. అవసరం తీరాక మీటూ అంటూ ఆడవారు ఆరోపణలు చేస్తారని ఇంకొందరు అంటారు. తాజాగా శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని లేపాయి.

    పనికోసం బయటకు..

    పనికోసం బయటకు..

    మీటూపై ముఖేష్ ఖన్నా స్పందిస్తూ.. ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడమే అడవారి పని. మీటూ అనేది ఆడవారు పనికోసం బయటకు వచ్చినప్పటి నుంచే మొదలైంది.. ఇప్పుడు ఆడవారు భుజం భుజం రాసుకు పూసుకు పని చేసుకుంటున్నారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. వీటిపై చిన్మయి ఫైర్ అయింది.

    అయ్యా, అంకుల్..

    అయ్యా, అంకుల్..

    చిన్మయి ముఖేశ్‌ని అయ్యా, అంకుల్ అని సంబోధిస్తూ.. ఈ మధ్యకాలంలో కొంతమంది మానసిక ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. నిజాన్ని గ్రహించకుండా, పాత ధోరణిలోనే ఆలోచిస్తుంటారు. మహిళలు పనులు, ఉద్యోగాలు చేయడంవల్లే మీటూ ఉద్యమం ప్రారంభమైందని చెప్పిన ఆయన.. పురుషులు తమ హింసాత్మకమైన కోరికలను కంట్రోల్‌ చేసుకోకపోవడం వల్లే ఇలాంటివి కొనసాగుతున్నాయని చెప్పలేకపోయారు'గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

    రాధిక సైతం..

    రాధిక సైతం..


    ఇలా ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలకు చిన్మయి కౌంటర్ ఇవ్వడంపై రాధిక స్పందించింది. వారి మూర్ఖత్వపు మాటలు వింటుంటే భయంకరంగా అనిపిస్తోంది. ఇలాంటి మాటలకు దూరంగా ఉండడమే మంచిది అని ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలను రాధిక తప్పుబట్టింది.

    English summary
    Chinmayi And Radhika On Mukesh Khanna Comments On Me Too, Mukesh Khanna Comments On Women About Me Too movement, Aurat ka kaam hai ghar sambhalna, jo maaf karna mein kabhi kabhi bol bhi jata hu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X