For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ల.ము అని తిడుతున్నారట.. ప్రతీ మహిళా అలాంటిదేనన్న చిన్మయి

  |

  గాయని చిన్మయి శ్రీపాద గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. సమంత మాట విన్న ప్రతీసారి గుర్తొచ్చే పేరు చిన్మయి. ఎందుకంటే సమంత సినీ కెరీర్‌కు చిన్మయి గొంతు అంతగా ఉపయోగపడింది. మొదటి చిత్రం ఏ మాయ చేశావే నుంచి ఇప్పటి వరకు చేసిన దాదాపు అన్ని సినిమాలకు సమంతకు డబ్బింగ్ చెప్పింది. పాటలు, డబ్బింగ్‌లతోనే కాకుండా కోలీవుడ్ వీరనారి, మీటూ ఉద్యమ నాయకురాలు, క్యాస్టింగ్ కౌచ్‌ను అంతం చేసే శక్తిగా ఎంతో ఫేమస్ అయింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో మీటూ ప్రకంపనలు పుట్టించి వైరముత్తు లాంటి దిగ్గజాన్ని వేలెత్తి చూపించింది చిన్మయి. ఇక అప్పటి నుంచి బాధిత మహిళల తరుపున పోరాటం చేస్తూనే ఉంది. తాజాగా ఆమె తనపై వస్తున్న కామెంట్లపై స్పందించింది.

  బాధిత మహిళల తరుపున..

  బాధిత మహిళల తరుపున..

  మీటూ పేరిట ఎంతో మంది మహిళలు ఎన్నో బాధలను అనుభవించారు. సినీ పరిశ్రమకు చెందిన వారే కాకుండా.. సాధారణ మహిళలు కూడా తమ జీవితంలో ఎదురైన సంఘటలను గురించి చిన్మయికి చెప్పుకునే వారు. ఆమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వాటిని ప్రపంచానికి తెలియజేసేది.

  కోలీవుడ్ పెద్దలతో పోటీ..

  కోలీవుడ్ పెద్దలతో పోటీ..

  కోలీవుడ్‌లో స్టార్ రైటర్ వైరముత్తు, రాధారవి వంటి వారితో ఢీ కొడుతోంది. వైరముత్తు ఎంతో మందిని వేధించాడని, చిన్నతనంలో తనతో కూడా అలాగే ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. వైరముత్తుపై ఇప్పటికీ అలుపెరగని పోరటం చేస్తోంది. డబ్బింగ్ యూనియన్ నుంచి చిన్మయిని తొలగించడం, కోర్టు కేసులు, ఎన్నికల గురించి అందరికీ తెలిసిందే.

  చిన్మయిపై వ్యతిరేకత..

  చిన్మయిపై వ్యతిరేకత..

  మహిళల తరుపున చిన్మయి నిలబడటం, వారి గొంతుగా మారి సమస్యలను చెప్పడంతో సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. తాను మహిళ గురించి, మహిళల హక్కుల గురించి మాట్లాడిన ప్రతీసారి తనకు దూషణలే ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చింది.

  ల.ము అని తిడుతున్నారు..

  ల.ము అని తిడుతున్నారు..

  చిన్మయి చేసే కామెంట్స్, పూజా హెగ్డే-సమంత విషయంలో రావడంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఈ క్రమంలో చిన్మయి స్పందిస్తూ.. ‘నేను బుల్లియింగ్ చేసినట్టు మీకనిపిస్తే నన్ను క్షమించండి. తప్పు చేస్తే క్షమాపణ అడగవలసినదే అని నాకు తెలుసు. నన్ను 'ల.ము'. అని తిట్టే అ-సభుయలకి, మిమ్మల్ని ఇలా తయారుచేసినవాళ్ళకి - మీ సంస్కారానికి ఓ దండం మీకు .(నా ఎకౌంట్ నా కంట్రోల్లోనేఉంది)' అని కామెంట్స్ చేసింది.

  మహిళలందరూ అలాంటి వారే..

  మహిళలందరూ అలాంటి వారే..

  అయితే ఈ క్రమంలో చిన్మయిని LM అని తిట్టడంపై నెటిజన్స్ సెటైర్స్ వేశారు. LM అంటే లేడీ మాఫీయా అని కొత్త అర్థాన్ని చెప్పారు. అయితే ఈ మేరకు చిన్మయి స్పందిస్తూ.. ఇంత వరకు ఆ పదాన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అయితే.. ఒక వేళ దాని అర్థం అదే అయితే.. మహిళలందరూ అదే లేడీ మాఫియాలు అని చెప్పుకొచ్చింది.

   కొత్త అర్ధానికి ధన్యవాదాలు..

  కొత్త అర్ధానికి ధన్యవాదాలు..

  ఇలా కొత్త అర్ధాన్ని చెప్పినందుకు, ఇన్ని రోజులు తనను LM అని పిలిచినందుకు తెలుగు సోషల్ మీడియా యూజర్స్ ధన్యవాదాలను తెలిపింది. ఈ గొప్ప కల్చర్ ఆడవాళ్లని ఇలా పబ్లిక్‌గా ప్రోత్సహిస్తరని ప్రదర్శినందుకు. మీ అసలు రూపం చూపెట్టినందుకు థ్యాంక్స్. ఆ పదాన్ని తాను అంగీకరిస్తానని తెలిపింది.

  English summary
  Chinmayi Sripaada was trolled By Netizens With LM. Some Netizens Abbreviated LM Means Lady Mafia.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X