For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో వివాదంలో చిన్మయి ఎంట్రీ.. ఆ విషయంలో పునర్నవి ముందడుగు వేసింది!

    |

    పునర్నవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, తన ఫోటోలు తన అనుమతి లేకుండా ఇష్టమొచ్చిన విధంగా వాడటంపై పునర్నవి ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన మీద, తన ఫోటోల మీద కామెంట్స్ చేస్తూ రాసే ఆర్టికల్స్‌పై పునర్నవి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా రాతలు రాసే వెబ్ సైట్లపై పునర్నవి నిప్పులు చెరిగింది. ఈ క్రమంలో పునర్నవికి మద్దతుగా చిన్మయి శ్రీపాద నిలిచింది.

    పునర్నవి ఫైర్..

    పునర్నవి ఫైర్..

    సదరు వెబ్ సైట్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఇదేం ఆర్టికల్.. మీరు రాసిందేమిటి.. పైగా నా అనుమతి లేకుండానా? నన్ను కించపరుస్తూ మీరు చాలా దూరం వెళ్లిపోయారు.. మీరు మీ కామెంట్లతో, ఆర్టికల్స్‌తో ఇండస్ట్రీలోని ఎంతో మంది మహిళలను కూడా ఇలాగే చేస్తున్నారు. ఇకపై ఇదంతా ఆపాలి.. సెక్సీయెస్ట్, చబ్బీ, హాట్ అంటూ సంబోధించడం, ఆర్టికల్స్ రాయడం వంటివి మానుకోవాలి' అంటూ పునర్నవి ఓ రేంజ్‌లో ఫైర్ అయింది.

    దిగొచ్చిన వెబ్ సైట్..

    దిగొచ్చిన వెబ్ సైట్..

    ఇక పునర్నవి అలా ఫైర్ అవ్వడంతో సదరు వెబ్ సైట్ దిగొచ్చింది. క్షమించండి పునర్నవి గారు అంటూ వేడుకుంది. అభ్యంతరకంగా అనిపించిన ఆ ఆర్టికల్‌ను తీసేశామని పునర్నవికి క్షమాపణలు చెప్పింది. అయితే పునర్నవి మాత్రం అంతటితో ఆగలేదు.

    నా అనుమతి లేకుండా..

    నా అనుమతి లేకుండా..

    ఈ విషయంపై పబ్లిక్‌గా ఆన్సర్ చేయాలని డిమాండ్ చేసింది. తన ఫోటోలను అలా ఎలా వాడుకుంటారని, పైగా తనకు చెప్పకుండా, అనుమతి లేకుండా హాట్ అని ఎలా రాస్తారని నిప్పులు చెరిగింది. ఇక ఈ విషయం మీడియాలో బాగానే వైరల్ అయింది. చివరకు ఈ విషయంపై చిన్మయి కూడా స్పందించింది.

    Samantha Fans Demand Apologize From Pooja Hegde
    ధైర్యవంతురాలు..

    ధైర్యవంతురాలు..

    ఇలాంటి వాటిపై ధైర్యమున్న ఓ మహిళా గొంతెత్తింది.. మరి మిగతా వారు కూడా రియాక్ట్ అవుతారని ఆశిస్తున్నానని అంటూ పునర్నవిపై చిన్మయి ప్రశంసల వర్షం కురిపించింది. వీటికి పునర్నవి స్పందిస్తూ.. థ్యాంక్స్ అని పేర్కొంది. మీ మాటలకు ధన్యవాదాలు.. నేను ఎప్పటికీ ఒంటరిని అని ఫీల్ కానని తెలిపింది.

    English summary
    Chinmayi Sripada Supports Punarnavi over Her Pics On Websites. Punarnavi Fires On Websites over Using Her Pics With Words HOt, Chubby Sexy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X