Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరో వివాదంలో చిన్మయి ఎంట్రీ.. ఆ విషయంలో పునర్నవి ముందడుగు వేసింది!
పునర్నవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, తన ఫోటోలు తన అనుమతి లేకుండా ఇష్టమొచ్చిన విధంగా వాడటంపై పునర్నవి ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన మీద, తన ఫోటోల మీద కామెంట్స్ చేస్తూ రాసే ఆర్టికల్స్‌పై పునర్నవి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా రాతలు రాసే వెబ్ సైట్లపై పునర్నవి నిప్పులు చెరిగింది. ఈ క్రమంలో పునర్నవికి మద్దతుగా చిన్మయి శ్రీపాద నిలిచింది.
పునర్నవి ఫైర్..
సదరు వెబ్ సైట్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఇదేం ఆర్టికల్.. మీరు రాసిందేమిటి.. పైగా నా అనుమతి లేకుండానా? నన్ను కించపరుస్తూ మీరు చాలా దూరం వెళ్లిపోయారు.. మీరు మీ కామెంట్లతో, ఆర్టికల్స్‌తో ఇండస్ట్రీలోని ఎంతో మంది మహిళలను కూడా ఇలాగే చేస్తున్నారు. ఇకపై ఇదంతా ఆపాలి.. సెక్సీయెస్ట్, చబ్బీ, హాట్ అంటూ సంబోధించడం, ఆర్టికల్స్ రాయడం వంటివి మానుకోవాలి' అంటూ పునర్నవి ఓ రేంజ్లో ఫైర్ అయింది.
దిగొచ్చిన వెబ్ సైట్..
ఇక పునర్నవి అలా ఫైర్ అవ్వడంతో సదరు వెబ్ సైట్ దిగొచ్చింది. క్షమించండి పునర్నవి గారు అంటూ వేడుకుంది. అభ్యంతరకంగా అనిపించిన ఆ ఆర్టికల్‌ను తీసేశామని పునర్నవికి క్షమాపణలు చెప్పింది. అయితే పునర్నవి మాత్రం అంతటితో ఆగలేదు.
నా అనుమతి లేకుండా..
ఈ విషయంపై పబ్లిక్‌గా ఆన్సర్ చేయాలని డిమాండ్ చేసింది. తన ఫోటోలను అలా ఎలా వాడుకుంటారని, పైగా తనకు చెప్పకుండా, అనుమతి లేకుండా హాట్ అని ఎలా రాస్తారని నిప్పులు చెరిగింది. ఇక ఈ విషయం మీడియాలో బాగానే వైరల్ అయింది. చివరకు ఈ విషయంపై చిన్మయి కూడా స్పందించింది.
Recommended Video
ధైర్యవంతురాలు..
ఇలాంటి వాటిపై ధైర్యమున్న ఓ మహిళా గొంతెత్తింది.. మరి మిగతా వారు కూడా రియాక్ట్ అవుతారని ఆశిస్తున్నానని అంటూ పునర్నవిపై చిన్మయి ప్రశంసల వర్షం కురిపించింది. వీటికి పునర్నవి స్పందిస్తూ.. థ్యాంక్స్ అని పేర్కొంది. మీ మాటలకు ధన్యవాదాలు.. నేను ఎప్పటికీ ఒంటరిని అని ఫీల్ కానని తెలిపింది.