twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆంజనేయుడి బొమ్మని గీసిన బాపు అలా అన్నాడా?.. నాటి స్మృతులను గుర్తు చేసుకున్న చిరు!

    |

    సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. తన మనసులో దాచుకున్ని ఎన్నో విషయాలను పంచుకుంటున్నాడు. ఎవ్వరికీ తెలియన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాను దున్నేస్తున్నాడు. చిరులోని ఈ హుషారు చూస్తుంటే యంగ్ హీరోలు ఏ మాత్రం నిలవలేరరనిపిస్తోంది. చిరు స్పీడ్‌కు బ్రేకుల్లేవ్ అన్న చందంగా సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తున్నాడు. ఏప్రిల్ 8 తారీఖుతో తనకెంతో అనుబంధం ఉందని హింట్ ఇచ్చిన చిరంజీవి.. నేడు వరుస ట్వీట్లతో గుట్టు విప్పేశాడు.

    నేడు హీరోల బర్త్ డేలు..

    నేడు హీరోల బర్త్ డేలు..

    నేడు (ఏప్రిల్ 8) చిరుకు ఎంతో ఇష్టమైన అల్లు అర్జున్, అఖిల్ అక్కినేని పుట్టిన రోజులు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ బర్త్ డే కూడా. వీటన్నంటిని మించి ఇష్టదైవం ఆంజనేయుడు పుట్టినరోజు. ఇలా హనుమాన్ జయంతి, పుత్ర సమానులైన హీరోల బర్త్ డేలు రావడంతో ఎంతో అనుబంధముందని చెప్పుకొచ్చాడు.

    బాపుగీసిన బొమ్మ..

    ఈ మేరకు ఏప్రిల్ 8తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ మొదటగా బాపు గురించి చెప్పుకొచ్చాడు. తనకూ, ఆంజనేయుడికి ఉన్న బంధాన్ని, బాపు గారి గీసిన బొమ్మ గురించి వివరిస్తూ నాటి స్మృతులను గుర్తు చేసుకున్నాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

    చిన్నప్పటి ఫోటో..

    ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది...చిన్నప్పటి నుంచి...1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?

    ఆంజనేయుడిలా ఉన్న చిరు..

    ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి" అన్నారు. అప్పటి నా ఫోటో.. అంటూ చిరు చిన్ననాటి ఫోటోను షేర్ చేశాడు.

    ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా..

    ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా..

    ‘కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా' అంటూ చిరు ట్వీట్ చేశాడు.

    Recommended Video

    PM Modi Telugu Tweet To Appreciate Chiranjeevi & Nagarjuna And Tollywood
    బొమ్మ గీస్తుంటే మీ పోలికలే వచ్చాయి..

    బొమ్మ గీస్తుంటే మీ పోలికలే వచ్చాయి..

    ‘బాపు గారు చెప్పిన మాట "ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షల'ను తెలిపాడు.

    English summary
    Chiranjeevi About Director Bapu And Hanuman Jayanthi. He Reveals The Secret Behind Hanuman Jayanthi And Bapu carrycatcher Hanuman Pic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X