twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లాసిక్‌కు ముప్పై ఏళ్లు.. ఆమె లేనిదే సినిమా లేదు .. నాటి విషయాలను పంచుకున్న మెగాస్టార్

    |

    తెలుగు సినీ చరిత్ర చెప్పుకోవాల్సి వచ్చిన ప్రతీసారి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్థావించాల్సిందే. ఎందుకంటే తెలుగు చిత్ర సీమలో నవ శకాన్ని రచించింది. కలెక్షన్లలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దేశం మొత్తం టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసింది. తెలుగు క్లాసిక్ చిత్రాల్లో ఎప్పటికీ చోటుండే జగదేకవీరుడుకి నేటితో ముప్పై యేళ్లు నిండాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర విశేషాలను సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా చెప్పుకొచ్చాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రావు దగ్గరి నుంచి వేటూరి వరకు అందరి గురించి పేరుపేరునా చెప్పుకొచ్చాడు.

     సమష్టి కృషికి నిదర్శనం..

    సమష్టి కృషికి నిదర్శనం..

    జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రిలీజై మే 7తో 30 ఏళ్లు పూర్తి చేసుకోబోతోన్న సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ఈ చిత్రంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేసాడు. సినిమా అనేది సమిష్ఠి కృషి ఫలితం అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్ర విజయంలో ప్రతి ఒక్కరి కృషి దాగుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్, నటీనటులు తమ ప్రతిభను కనబరిచినందుకే జగదేకవీరుడు అతిలోకసుందరి తెలుగు సినిమా క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిపోయిందన్నాడు.

    టైమ్ లెస్ సినిమా..

    టైమ్ లెస్ సినిమా..

    తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ 25 చిత్రాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు తప్పక స్థానం ఉంటుందన్నాడు. ఇది పాత తరం సినిమా.. కొత్త తరం సినిమా అనే తేడా లేకుండా అన్ని తరాలను అలరించే టైమ్ లెస్ క్లాసిక్ అని ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టమని చెప్పుకొచ్చాడు.

    అగ్రతాంబూలం దర్శకేంద్రుడిదే..

    అగ్రతాంబూలం దర్శకేంద్రుడిదే..

    ఇక ఈ సినిమా విషయానికొస్తే.. అగ్రతాంబూలం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకే దక్కుతుందన్నాడు. స్టోరీ లైన్ దగ్గరి నుంచి సినిమా వెంటే నడిచాడని తెలిపాడు. ప్రతీ సీన్‌ను ఎంతో గొప్పగా ఓ శిల్పిలా చెక్కారు. మలిచారని కొనియాడాడు. ఈ సినిమాతో తానేంటో నిరూపించుకోవాలని కసితో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని తెలిపాడు. తనను ఎద్దేవా చేసిన వారందరికీ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించి చెంపపెట్టులా చేశాడని అన్నాడు. అమ్రిష్ పురి మాయల మాంత్రికుడు అయితే.. మా సినిమాకు సృష్టి మాంత్రికుడని ప్రశంసల వర్షం కురిపించాడు.

    శ్రీదేవీ లేనిదే సినిమా లేదు..

    శ్రీదేవీ లేనిదే సినిమా లేదు..

    శ్రీదేవీ గురించి మాట్లాడుతూ.. ఆమె లేనిదే సినిమా లేదని చిరు పేర్కొన్నాడు.. ఆమె కోసమే సినిమా వచ్చిందా? అనేంత గొప్పగా నటించిందని కితాబిచ్చాడు. ఆమెను తప్పా ఇంకెవర్నీ ఊహించలేమని, ఆ చూపులు, చిలక పలుకులు.. వాటి గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకునేంతగా ఇంపాక్ట్ చేసిందని అన్నాడు. అతిలోక సుందరి పాత్రలో శ్రీదేవీ జీవించిందని పేర్కొన్నాడు. పాటల విషయంలో చాలా టెన్షన్ పడ్డాడని, ఏమాత్రం కొంచెం తప్పుగా చేసినా ఆమె అందం ముందు తేలిపోయేవాడ్ని. డ్యాన్సుల విషయంలో చాలా పోటీ పడ్డానని అన్నాడు.

    క్యాష్ కాదు కీర్తి..

    క్యాష్ కాదు కీర్తి..


    తాను చూసిన నిర్మాతల్లో అశ్వనీదత్ కాంప్రమైజ్ కాని ఓ నిర్మాత అని చెప్పుకొచ్చాడు. ఎంత క్యాష్ పోయింది చూసుకోరు... ఎంత కీర్తి మిగిలిందో చూస్తారని ప్రశంసల జల్లు కురిపించాడు.. క్వాలిటీ, భారీతనంలో, రిచ్ నెస్‌ కోసం నిరంతరం పరితపిస్తుంటారని కొనియాడాడు. ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్ అని అన్నాడు.

    వేటూరి..

    వేటూరి..

    వేటూరి గారు ఈ చిత్రానికి రాసిన ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యమని ప్రశంసించాడు. వేటూరి రాసిన పాటలు ఇప్పటికీ వావ్ అనిపిస్తాయన్నాడు. అందాలలో మహోదయం, ప్రియతమా.. అబ్బని తీయని దెబ్బ.. అవి వింటూ ఉంటే నాటి సంగతులు ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంటాయన్నాడు. అబ్బనీ తీయనీ దెబ్బ విషయానికొస్తే.. ఇళయరాజా మార్నింగ్ ట్యూన్ పంపించారని, మధ్యాహ్నానికల్లా వేటూరి గారి లిరిక్స్ పూర్తి చేశారని, నాలుగు గంటలకల్లా సాంగ్ కంపోజిషణ్ అయిపోయిందని తెలిపాడు..

    విఎఫెక్స్ లేని రోజుల్లో..

    విఎఫెక్స్ లేని రోజుల్లో..

    సినిమాటోగ్రాఫర విన్సెంట్ గురిచి ముఖ్యంగా చెప్పుకోవాలన్నాడు. విఎఫెక్స్ లేని రోజుల్లో ఎంతో అద్భుతంగా చూపించారని ప్రశంసించాడు. ఇన్ డోర్‌లో చేసినవి కూడా ఎక్కడో మంచు కొండల్లొ తీసినట్టు ఎంతో అద్భుతంగా చూపించాడని అన్నాడు. ఆ రోజుల్లోనే అత్యద్భుతంగా తీసి వావ్ అనిపించుకున్నాడని తెలిపాడు. ఈ చిత్రం కేవలం తన కెరీర్‌లొనే కాదు.. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరి కెరీర్‌లో ఓ ఆణిముత్యమని పేర్కొన్నాడు

    English summary
    Chiranjeevi About Sridevi On 30 Years Of Jagadeka Veerudu Athiloka Sundari. Chiranjeevi About Tells About Veturi, Ilayaraja, Raghavendra Rao, Asawnidutt.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X