అజ్ఞాతంలోకి చిరంజీవి.. మెగా హీరోల మౌనం.. దిక్కుతోచని పరిస్థితుల్లో పవన్, నాగబాబు
Recommended Video

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే ప్రధానంగా ఉండేవి. ప్రస్తుత ఎన్నికల్లో జనసేన కూడా రెండు ప్రధాన పార్టీలకు ధీటుగా పలుచోట్ల అభ్యర్థులను ఖారారు చేయడంతో పోటీ ముక్కోణంగా మారింది. అయితే సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనకు చిరంజీవి ప్రచారం చేస్తారా అనే ప్రశ్నల నేపథ్యంలో మెగాస్టార్ మౌనం వహించడం ప్రశ్నార్థంకగా మారింది. ఇంతకు చిరంజీవి మౌనం వహించడానికి కారణమేమిటంటే..

చర్చకు తెరలేపిన అభ్యర్థులు
జనసేన పార్టీ అభ్యర్థులందరూ సాధారణ ప్రజలే కావడంతో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. ఎన్నికల నామినేషన్లు ఆరంభం కావడంతో ఆసక్తికరమైన ప్రముఖులు పార్టీ అభ్యర్థులుగా మారారు. అందులో నాగబాబు, జేడీ లక్ష్మీనారాయణ, ఎస్పీవై రెడ్డి లాంటి ఉండటంతో కొంత జోష్ పెరిగింది. మెగా బ్రదర్ నరసాపురం నుంచి బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

చిరంజీవి మౌనం వెనుక
జనసేన పార్టీ తరఫున భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పవన్ కల్యాణ్ బరిలోకి దిగాడు. నాగబాబు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ఈ క్రమంలో తన మెగా సోదరులకు చిరంజీవి క్యాంపెయిన్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే మెగాస్టార్ ఎలాంటి నుంచి స్పందన రాలేదు. అందుకు కారణం కూడా ఉంది.

ఇబ్బందికరమైన పరిస్థితిలో
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే అక్కడ పవన్ అభిమానులు జనసేనకు జై కొట్టమని బలవంతం చేయడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. సినీ, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్లడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎన్నికలు పూర్తయ్యేంత వరకు చిరంజీవి అజాతంలోకి వెళ్లారట.

మీడియాలో జోరుగా ఊహాగానాలు
ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం చిరంజీవి ప్రెస్ మీట్ పెడుతున్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రావుతో భేటీ అవుతున్నారు అనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే ఆ వార్తలో నిజం లేదంటూ ఆయన పీఆర్ వర్గాలు స్పందించాయి. ఇలా చిరంజీవిని అనేక రకాలుగా బయటకు లాగేందుకు కొన్ని మీడియా వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

అంతుపట్టని చిరంజీవి వైఖరి
ఇటీవల కాలంలో కాంగ్రెస్‌కు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న చిరంజీవి రాజకీయ ఉద్దేశం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇటీవల కాలంలో ప్రస్తుతం తన దృష్టంతా సైరా సినిమాపైనే ఉందని పలు సందర్భాల్లో చెప్పుకొంటు వస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపని సంగతి తెలిసిందే.

అంతర్గతంగా కార్యచరణ, వ్యూహాలు
జనసేనకు బహిరంగంగా మద్దతు తెలుపకపోయినా చిరంజీవి అంతర్గతంగా తన కార్యచరణ, వ్యూహాలను సిద్ధం చేసుకొన్నారట. ఏపీలోని అన్ని జిల్లాల్లోని మెగా ఫ్యాన్స్‌కు తన క్యాంప్ ద్వారా క్లియర్‌గా ఆదేశాలు జారీ చేస్తున్నారనేది సినీ వర్గాల సమాచారం. బయటకు రాకుండానే జనసేనకు బలం చేకూరేలా ప్రయత్నాలు చేస్తున్నారట. అన్ని జిల్లా ఫ్యాన్స్ అధ్యక్షులతో నిరంతరం చర్చలు చేస్తున్నట్టు తెలిసింది.

మెగా హీరోలు కూడా మౌనమే
అయితే తెలంగాణకు సంబంధించిన ఎన్నికలు చిరంజీవికి అంతగా పట్టని అంశం. కానీ సొంత తమ్ముళ్లు పవన్ కల్యాణ్, నాగబాబు తరఫున చిరంజీవి ప్రచారం చేస్తారనే ఊహాగానాలు బలంగా మీడియాలో షికారు చేస్తున్నాయి. మెగా హీరోలు కూడా ఎవరూ అంతగా బయటకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎంత మేరకు ఉంటుందనే విషయం రెండు రోజులు ఆగితే తెలుస్తుందనే విషయాన్ని సన్నిహితులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











