కోదండరామిరెడ్డి బర్త్ డే: సరదాగా గడిపిన చిరు, బాలయ్య, వెంకీ, ఇంకా స్టార్స్ (ఫోటోస్)

తెలుగు సినీ పరిశ్రమకు కమర్షియల్ హిట్స్ అందించిన దర్శకుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ఎ.కోదండరామిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలతో ఆయన పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు.

తెలుగు సినిమా పరిశ్రమలో పాత్ బ్రేకింగ్ చిత్రాలుగా చెప్పబడే ఖైదీ, అభిలాష, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ముఠా మేస్త్రీ లాంటి చిత్రాలు రూపొందించిన ఘనత కోదండరామిరెడ్డి సొంతం. మూడు దశాబ్దాల పాటు కెరీర్ కొనసాగించిన ఈ లెజెండరీ డైరెక్టర్ జులై 1న 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుక సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ హాజరు

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ హాజరు

కోదండరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలకు మెగాస్టార్ చిరంజీవితో పాటు నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, బి గోపాల్, అశ్వినీదత్, దిల్ రాజు, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా కోదండ రామిరెడ్డి పుట్టినరోజు వేడుక జరిగింది.

చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమలో టాలీవుడ్ స్టార్స్ సరదాగా

చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమలో టాలీవుడ్ స్టార్స్ సరదాగా

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, కె రాఘవేంద్రరావు, బి గోపాల్, అశ్వినీదత్ లాంటి సినీ ప్రముఖులు చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమలో కనిపించారు. కోదండరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలో అంతా కలిసి సరదాగా గడిపారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చిరంజీవితో కోదండరామిరెడ్డి

చిరంజీవితో కోదండరామిరెడ్డి

కోదండరామిరెడ్డికి చిరంజీవి తెల్లగులాబీల పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ఖైదీ, అభిలాష, గుండా, ఛాలెంజ్, దొంగ, రక్తసింధూరం, విజేత, రాక్షసుడు, దొంగ మొగుడు, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, ముఠా మేస్త్రీ లాంటి చిత్రాలు తెరకెక్కాయి.

ఎ కోదండ రామిరెడ్డి

ఎ కోదండ రామిరెడ్డి

1980లో సంధ్య అనే సినిమా ద్వారా కోదండరామిరెడ్డి దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. టాలీవుడ్లో 1980, 1990ల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆయన పని చేశారు. కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ కూడా నటుడిగా రాణిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X