చిరంజీవితో ముగ్గురు హీరోల బాక్సాఫీస్ పోటీ.. ఒక్కరోజే ఢీ కొడుతున్న 4 సినిమాలు!

సుమారు 40 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకున్న ఆయన త్వరలో భోళా శంకర్ సినిమాతో రానున్నారు. అయితే చిరంజీవితో ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ బరిలోకి నిలిచేందుకు రెడీగా ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

భోళా శంకర్ : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరుకి జోడీగా మిల్కీ బ్యూటి తమన్నా నటించనుండగా.. మహానటి కీర్తి సురేష్ చెల్లెలుగా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ అజిత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ అని వార్తలు వస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్.

Chiranjeevi Bhola Shankar

యానిమల్ : అర్జున్ రెడ్డి సినిమాతో ఇటు తెలుగులో, కబీర్ సింగ్ మూవీతో అటు హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ రెండు సినిమాల తర్వాత తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం యానిమల్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 11నే విడుదల చేయనున్నారు. ఇందులో ఎప్పుడూ చూడని వయెలెన్స్ ను చూస్తారని ఓ ఇంటర్వ్యూలో సందీప్ చెప్పారు.

Chiranjeevi Bhola Shankar

మహావీరుడు : రెమో, వరుణ్ డాక్టర్, కాలేజీ డాన్, ప్రిన్స్ సినిమాలతో తమిళ హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకక్టున్నాడు. తాజాగా ఆయన మడోన్ అశ్విన్ దర్శకత్వంలో హీరోగా చేస్తున్న సినిమా మహావీరుడు. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు టైటిల్ వీడియో విడుదల చేసిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నారు.

డీజే టిల్లు స్క్వేర్ : చిన్న సినిమాగా విడుదలైన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో ఒక్కసారిగా సిద్ధు జొన్నలగడ్డ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు డీజే టిల్లు స్క్వేర్ తో మరోసారి అలరించనున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తోంది. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీని కూడా ఆగస్టు 11కే విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ తేదిని ఇంకా ఖరారు చేయలేదు.

Chiranjeevi Bhola Shankar

ఆగస్టు 11 పైనే: భోళా శంకర్, యానిమల్, మహావీరుడు సినిమాల విడుదల తేదీ ఆగస్టు 11 అని ఆ సినిమాల మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే డీజే టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు కానీ, ఈ సినిమా దర్శక నిర్మాతలు ఆగస్టు 11 వైపే మొగ్గు చూపుతున్నారు అని టాక్. దీనిపై త్వరలోనే ఓ అధికారన ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది.

ఒకేరోజు 4.. మరి కలెక్షన్స్ : ఒకవేళ ఈ సినిమా కూడా ఆగస్టు 11నే రిలీజ్ చేసేందుకు రెడీ అయితే ముగ్గురు యంగ్ హీరోలు అయిన రణ్ బీర్, శివకార్తికేయన్, సిద్ధు జొన్నలగడ్డ మెగాస్టార్ చిరంజీవితో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీకి దిగినట్లే అవుతుంది. మరి ఒక్కరోజే నాలుగు చిత్రాలు విడుదలైతే ఏ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో, ఏ హీరోకు కలెక్షన్స్ వస్తాయో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X