For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి బర్త్‌డే స్పెషల్: కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఇదే.. చాలా మందికి తెలియని విషయాలివే.!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదగలేదు. ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు (ఆగస్టు 22). ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని అంశాలను గుర్తు చేసుకుందాం.

  చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ సందడి (ఫోటో గ్యాలరీ)

  చిరంజీవి అసలు పేరు ఇదే

  చిరంజీవి అసలు పేరు ఇదే

  చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్‌. 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. తండ్రి కొణిదెల వెంకట్రావు, తల్లి అంజనాదేవి. వీరికి మొత్తం ముగ్గురు సంతానం. అందులో చిరంజీవి మొదటివారు. మిగిలిన ఇద్దరు సోదరులు నాగేంద్రబాబు, పవన్‌కల్యాణ్‌. 1980లో ప్రసిద్ధ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు (రామ్‌ చరణ్‌) ఉన్నారు. ప్రస్తుతం కుమారుడు కూడా సినిమాల్లో కథానాయకుడిగా కొనసాగుతున్నాడు.

  కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా

  కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా

  చిరంజీవి 1978లో ‘పునాదిరాళ్లు' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 1983లో కోదండరామ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ' సినిమా.. చిరంజీవిని కథానాయకుడిగా నిలదొక్కుకునేలా చేసింది. ఇందులో చిరు నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా అతడి కెరీర్‌నే మలుపు తిప్పేసిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే ఈ సినిమాతో 4 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

   బ్రేక్ డ్యాన్స్‌ను పరిచయం చేశాడు

  బ్రేక్ డ్యాన్స్‌ను పరిచయం చేశాడు

  చిరంజీవి రాకముందు వరకు ఒక రకంగా ఉన్న డ్యాన్స్‌ ఆ తర్వాత కొత్త పుంతలు తొక్కింది. ఎన్నో సినిమాల్లో మాస్ డ్యాన్స్‌తో మెప్పించిన చిరు.. ‘పసివాడి ప్రాణం' చిత్రం ద్వారా తెలుగు తెరకు తొలిసారి ‘బ్రేక్‌ డ్యాన్స్‌'ను పరిచయం చేశారు. ఆ తర్వాత చాలా సినిమాల వరకు ఇది కొనసాగింది. చిరు బ్రేక్ డ్యాన్స్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో లెక్కకట్టడం కష్టమనే చెప్పాలి. అంతగా అతడి గ్రేస్ చూపించారు. దీంతో యాక్టర్‌గానే కాకుండా డ్యాన్సర్‌గానూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

  గుర్తింపు తెచ్చిన సినిమాలు

  గుర్తింపు తెచ్చిన సినిమాలు

  ‘ఖైదీ' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన చిరంజీవి తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. వాటిలో ‘చంటబ్బాయ్‌', ‘ఛాలెంజ్‌', ‘అభిలాష', ‘శుభలేఖ', ‘గ్యాంగ్‌ లీడర్‌', ‘రౌడీ అల్లుడు', ‘ఘరానా మొగుడు', ‘స్వయం కృషి', ‘రుద్రవీణ', ‘ఆపద్భాందవుడు', ‘యముడికి మొగుడు', ‘అత్మకు యముడు.. అమ్మాయికి మొగుడు', ‘జగదేక వీరుడు అతిలోక సుందరి', ‘చూడాలని ఉంది', ‘బావగారూ బాగున్నారా!' ‘ఇంద్ర', ‘ఠాగూర్‌', ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' వంటి చిత్రాలు అతడికి ప్రత్యేక గుర్తింపును తీసుకు వచ్చాయి.

  రాజకీయ ప్రస్తానం

  రాజకీయ ప్రస్తానం

  మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే హఠాత్తుగా రాజకీయాల వైపు వెళ్లారు. 2008 ఆగస్టులో ‘ప్రజా రాజ్యం' పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 295 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి 18స్థానాల్లో గెలుపొందారు. 2011 ఫిబ్రవరిలో ‘ప్రజా రాజ్యం' పార్టీని ‘కాంగ్రెస్‌'లో వీలీనం చేశారు. ఆ తర్వాత 2012 మార్చిలో రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. కేంద్ర పర్యాటకశాఖా మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

  ‘ఖైదీ నెంబర్ 150'తో కమ్ బ్యాక్

  ‘ఖైదీ నెంబర్ 150'తో కమ్ బ్యాక్

  రెండేళ్ల క్రితం ‘ఖైదీ నెంబర్ 150'తో తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమాలో చిరు నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే భారీ వసూళ్లను కూడా రాబట్టిందీ సినిమా. ఇక, ఈ సినిమా తర్వాత కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదలై రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

  అవార్డులు.. గౌరవాలు

  అవార్డులు.. గౌరవాలు

  చిరంజీవి సినీ జీవితంలో ఎన్నో చిత్రాలకు అవార్డులు దక్కాయి. అలాగే, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్‌ పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును అందుకున్నారు. వీటితో పాటు అనేక జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, నంది, ఫిలింఫెయిర్‌ పురస్కారాలు అందుకున్నారు. ఇక, బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తూ చాలా మందికి రక్త ప్రదాత అవుతున్నారు. దీంతో ఎంతో మంది నుంచి ‘అన్నయ్య' అన్న పేరును సంపాదించుకున్నారు. అందుకే ఇప్పుడందరూ ఏకమై ‘హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్' అంటూ చెబుతున్నారు.

  English summary
  Konidela Siva Sankara Vara Prasad (born 22 August 1955), better known by his stage name Chiranjeevi, is an Indian film actor and politician. He was the Minister of State with independent charge for the Ministry of Tourism, Government of India from 27 October 2012 to 15 May 2014
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X