నాకు మార్గదర్శి, గురువు.. అల్లు రామలింగయ్యను తలుచుకుంటూ చిరంజీవి ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవికి అల్లు రామలింగయ్య వెన్నుదన్నుగా నిలిచాడు. అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయడం వెనుక కూడా పెద్ద కథే ఉందట. అంతకు ముందు నుంచే చిరంజీవిని గమనించడం, నిఘా పెట్టడం లాంటివి కూడా జరిగాయట. అయితే చిరంజీవి కాండాక్ట్ సర్ఠిఫికెట్ గుడ్ అని తేలడంతో అల్లుడిగా ఫిక్స్ చేసుకున్నారట. ఈ సంగతులను గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు చిరంజీవి. అంత కేరింగ్‌గా చూసుకునే అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు అంటూ చిరంజీవి ఎమోనల్ అయ్యాడు.

తియ్యని గుళికలతో

తియ్యని గుళికలతో

అల్లు రామలింగయ్య పేరు గుర్తురాగానే అందరి పెదాలపైన చిరునవ్వు మెదుల్తుంది.. మావయ్య గారు కేవలం అందరినీ మెప్పించిన నటుడే కాదు. తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియో పతి డాక్టర్ కూడా. అంటూ అల్లు రామలింగయ్యను గుర్తు చేసుకున్నాడు చిరంజీవి.

నాకు మార్గదర్శి.. గురువు..

నాకు మార్గదర్శి.. గురువు..

అల్లు రామలింగయ్య గురించి ఇంకా చెబుతూ.. స్వాతంత్ర సమరయోధుడు, తత్త్వవేత్త, నాకు మార్గదర్శి.. గురువు.. అన్నింటికి మించి మనసున్న మనిషి. ఈ 99వ పుట్టిన రోజు నాడు ఆయన్ని స్మరిస్తూ.. వచ్చే సంవత్సరం ఆయన శతజయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవిన విధానాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తున్నాను అని చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు.

రామ్ చరణ్ సైతం..

రామ్ చరణ్ సైతం..

రామ్ చరణ్ తన తాతయ్య అల్లు రామలింగయ్యను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మా తాత అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా అంతా ఓసారి స్మరించుకుందాం.. ఆయన్ని ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాం అంటూ ట్వీట్ చేశాడు.

Recommended Video

Nikhil Siddharth Stylish Look After Marriage
అల్లు వారి కీలక ప్రకటన..

అల్లు వారి కీలక ప్రకటన..

అల్లు రామ‌లింగ‌య్య జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అల్లు వారి కుటుంబం ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రించింది. అల్లు అర‌వింద్ అండ్ ఫ్యామిలీ అల్లు రామ‌లింగ‌య్య పేరు మీదుగా అల్లు స్టూడియోస్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మేరకు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, అల్లు అరవింద్ అందరూ కలిసి ఓ ప్రకటనను చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X