మై డియర్ బచ్చ.. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే.. రామ్ చరణ్ పరువు తీసిన చిరంజీవి
చిరంజీవి రంగంలోకి దిగితే అది బాక్సాఫీస్ అయినా వెండితెర అయినా బుల్లితెర అయినా బద్దలవ్వాల్సింది. ఇన్ని రోజులు తెరపైన మాత్రమే చిరు దూకుడును చూశాము. కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను దున్ని అవతల పారేయడంలో చిరు శైలిని ప్రత్యేకంగా చూస్తున్నాము. ట్విట్టర్‌లో చిరు వేసే పంచ్‌లు, సెటైర్స్ ఏ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చిరు దెబ్బకు ఎంతో మంది నోరు మూసుకుని కూర్చున్నారు. మోహన్ బాబు, రాఘవేంద్రరావు, పూరి జగన్నాద్‌లకు చిరు ఇచ్చిన పంచ్‌లు అంత త్వరగా ఎవ్వరూ మరిచిపోరు.
Recommended Video

ట్విట్టర్‌ను రఫ్పాడిస్తున్న చిరు..
ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. అప్పటి నుంచి ఒకటే బాదుడు. రికామ్ లేకుండా అందరి లెక్కలను సరి చేస్తున్నాడు. తెల్లారి లేస్తే ఎవ్వరి మీదా పడతాడా? ఎలాంటి సెటైర్స్ వేస్తారా? అని ఎంతో మంది కాచుకుని కూర్చున్నారు.

సచిన్‌కు సైతం..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పుట్టిన రోజున విష్ చేసిన చిరు ఆయన ఆట స్టైల్లోనే కౌంటర్ వేశాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అఫెన్స్ చేసుకోవడానికి డిఫెన్స్ ఆడటమే అత్యుత్తమం అంటూ ట్వీట్ చేసి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాడు.తాజాగా రామ్ చరణ్‌ను సైతం వదల్లేదు.

వెన్న చిలుకుతున్న చెర్రీ..
రామ్ చరణ్ వంటింట్లో దుమ్ములేపుతాడన్న సంగతి తెలిసిందే. చెర్రీ చెయ్యి తిరిగిన వంటగాడని ఇది వరకు షేర్ చేసిన వీడియోలు చూస్తేనే తెలుస్తోంది. అయితే తాజాగా నానమ్మ సారథ్యంలో వెన్నె చేయడం నేర్చుకుంటున్నాడు చెర్రీ. కవ్వం పట్టి వెన్నెను చిలుకుతూ ఉంటే.. కృష్టుడిలా ఉన్నావ్ అంటూ నానమ్మ మురిసిపోయింది.
మై డియర్ బచ్చా..
తన అమ్మ (అంజనా దేవీ)ను రామ్ చరణ్ కాకపపట్టడం చూసిన చిరు.. చరణ్‌పై ఓ సెటైర్ వేశాడు. ‘మై డియర్ బచ్చ.. మా అమ్మ దగ్గర నీ బట్టర్ ఉడకదురా.. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడూ నాదే.. నువ్ ఎంత బట్టర్ రాసినా.. నీ పొజిషన్ బెట్టర్ కాదు.. అదే గ్యారంటీ నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో అంటూ తల్లీ కొడుకుల రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











