మెగా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: వచ్చే ఏడాది చిరంజీవి సినిమా రానట్లే.. కారణం ఈ నిర్ణయమే.!

By Manoj

'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్ బ్యాక్‌ను అదిరిపోయేలా చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఉత్సాహంతోనే ఆయన మరికొన్ని చిత్రాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ఇటీవల 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వాస్తవానికి ఇది షూటింగ్ జరుపుకుంటుండగానే.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది

ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది

మెగాస్టార్ ఇటీవల ‘సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో వచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి రూపొందించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సంపాదించుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా నిరాశనే మిగిల్చి నష్టాలను చవిచూసింది.

 ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరొకటి

ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరొకటి

చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను కూడా రామ్ చరణే నిర్మిస్తున్నాడు. మ్యాట్నీ మూవీస్ సంస్థ సహా నిర్మాతగా వ్యవహరించనుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్టు రెగ్యూలర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుందని సమాచారం.

మరో సోషల్ పాయింట్‌తో వస్తున్నారు

మరో సోషల్ పాయింట్‌తో వస్తున్నారు

‘ఖైదీ నెంబర్ 150'లో రైతు సమస్యలపై పోరాడిన చిరంజీవి.. కొరటాలతో చేయబోయే మూవీలో దేవాలయ భూముల కబ్జాదారులను ఎదురిస్తారని ప్రచారం జరుగుతోంది. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల.. ఈ సినిమా కోసం అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశారని తెలిసింది. దీనికి ‘గోవింద ఆచార్య' కానీ ‘గోవిందా హరి గోవింద' అనే టైటిల్ కానీ ఫిక్స్ చేస్తారని టాక్.

రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు

రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు

వాస్తవానికి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ నవంబర్ నుంచే ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఎందుకనో అలా జరగలేదు. దీంతో డిసెంబర్ మొదటి వారం స్టార్ట్ అవుతుందని అన్నారు. కానీ అదీ అవలేదు. అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కొందరు డేట్‌ పలానాది అంటూ చెప్పుకొచ్చారు.

వచ్చే ఏడాది చిరంజీవి సినిమా రానట్లే

వచ్చే ఏడాది చిరంజీవి సినిమా రానట్లే

అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాదని తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించాలని ప్లాన్ చేయడమేనన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను హిందీలోనూ తెరకెక్కించేందుకు ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X