twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లో వినాయక చవితి సెలెబ్రేషన్స్.. ఒక్కొక్కరింట్లో ఒక్కో రకంగా.. వైరల్ పిక్స్

    |

    టాలీవుడ్‌లో వినాయక చవితి సంబరాలు మిన్నంటాయి. ప్రతీ ఫ్యామిలీ తమ ఇంట్లో మట్టి వినాయకులను ప్రతిష్టాంచారు. కుటుంబ సభ్యులంతా ఒక్క చోట చేరారు. పిల్లలతో ఇళ్లంతా సందడిగా మారింది. ఇక భక్తి శ్రద్దలతో హీరోలంతా పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడిపారు. ఇక ఈ మేరకు వినాయకుడి విగ్రహాలకు పూజలు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ మేరకు హీరోల ఫోటోలు ఎంతగానో వైరల్ అవుతున్నాయి. మెగా, అల్లు, ఘట్టమనేని, మంచు ఫ్యామిలీల్లో సంబరాలు అంబరాన్నంటాయి.

    మహేష్ బాబు ఇంట్లో మట్టి వినాయకుడు..

    మహేష్ బాబు ఇంట్లో మట్టి వినాయకుడు..

    మహేష్ బాబు సతీమణి నమ్రత సంప్రదాయబద్దంగా వినాయక చవితి పూజలు చేశారు. ఈ మేరకు పూజ అనంతం పిల్లలిద్దరితో దేవుడికి దండం పెట్టించినట్టు తెలుస్తోంది. ఇక పిల్లలతో పాటు పూజ గదిలో నమ్రత ఫోటోలు దిగారు. అన్ని విఘ్నాలను తొలిగించి మనల్ని కాపాడేవాడు అంటూ గణపతి బప్పా మోరియా అంటూ దండం పెట్టారు.

    మెగా వినాయకుడు..

    మెగా వినాయకుడు..

    మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గణనాథుని పూజలు ఘనంగా జరిగాయి. చిరు చిన్న కూతురు ఫ్యామిలీ కూడా ఈవేడుకల్లో పాల్గొంది. రామ్ చరణ్, ఉపాసన , కళ్యాణ్ దేవ్, శ్రీజ, సురేఖ అందరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

    పూజ చేసిన మోహన్ బాబు..

    పూజ చేసిన మోహన్ బాబు..

    స్వతహాగానే దైవ భక్తి కలిగిన మోహన్ బాబు.. వినాయక చవితికి ప్రత్యేక పూజలు చేస్తారట. ప్రతీయేడులానే ఈ సారి కూడా శ్లోకాలు, మంత్రాలు చదివి శాస్త్రోక్తంగా గణనాథుడిని పూజించారు. ఈ మేరకు మంచు లక్ష్మీ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

    బన్నీ ఇంట్లో ప్రత్యేకంగా..

    బన్నీ ఇంట్లో ప్రత్యేకంగా..

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో వినాయకుడిని పూజలు ప్రత్యేకంగా జరిగినట్టు తెలుస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో బన్నీ ఫ్యామిలీ అదిరిపోయింది. ఈ మేరకు బన్నీ షేర్ చేసిన ఫోటోల్లో అర్హ, అయాన్‌లు ఎంతో ముద్దుగా ఉన్నారు. పండుగ ఏదైనా సరే అల్లు పిల్లల సందడే వేరుగా ఉంటుంది.

    భార్యతో పూజలు..

    భార్యతో పూజలు..

    రీసెంట్‌గా ఓ ఇంటి వాడైన నితిన్ తన భార్య షాలినితో కలిసి వినాయకుడికి పూజ చేశారు. ఈ సందర్భంగా నితిన్ అమ్మ దగ్గరుండి మరీ పూజ చేయించినట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలను నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.

    Recommended Video

    Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
    హిట్ హీరో అలా.. దర్శకుడు ఇలా..

    హిట్ హీరో అలా.. దర్శకుడు ఇలా..

    హిట్ హీరో విశ్వక్‌సేన్ పసుపుతో విఘ్నేశుడిని తయారు చేశాడు. పర్యావరణానికి హాయి చేయనటువంటి ఈ విగ్రహాన్ని తాను తయారు చేసినట్టు విశ్వక్ తెలిపాడు. మరో వైపు శైలేష్ కొలను మట్టి వినాయకుడి ముందు హిట్ 2 స్క్రిప్ట్ పెట్టేశాను అంటూ చెప్పుకొచ్చాడు.

    English summary
    Chiranjeevi Mahesh Babu Allu Arjun On Ganesh Chaturthi Celebrations Ganpati bappa Morya He's home, bringing us love. Protecting us from all the challenges and assuring us all will be well Prayers and blessings to all celebrating him today and everyday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X