twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గురు శిష్యుల బంధమంటే ఇదే.. కళాతపస్వికి పాదాభివందనం చేసిన చిరంజీవి

    |

    ఎంతటి మెగాస్టార్ అయినా అమ్మకు కొడుకే.. గురువుకు శిష్యుడే. మెగాస్టార్ చిరంజీవి తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఎదుటివారిని గౌరవించడంలో, మర్యాద ఇవ్వడంలో ముందుంటాడు. మరీ ముఖ్యంగా తనకు గురువైన కళాతపస్వీ కే విశ్వనాథ్‌ను గౌరవించుకోవడంలో ముందుంటాడు. అక్కడ ఎలాంటి ప్రోటోకాల్‌ను ఉపయోగించుకోడు. ఆ మధ్య కళాతపస్వీకి సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం లభించిన సందర్భంలో కలిశాడు.

    ఆప్యాయంగా పలకరించాడు..

    ఆప్యాయంగా పలకరించాడు..

    కళాతపస్వికి దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఆ సందర్భంగా గురువును ప్రత్యేకంగా కలిసి అభినందించాడు. ఫోన్‌లో ఎవరితోనే కే విశ్వనాథ్ మాట్లాడుతూ ఉంటే అంత సేపు ఎదురుచూశాడు. గురును డిస్టర్బ్ చేయొద్దని ఆ తరువాతే పలకరించాడు. మళ్లీ తాజాగా దీపావళి పర్వదినాన సతీసమేతం చిరంజీవి కళాతపస్వీ ఇంటికి వెళ్లారు.

    దీపావళి సందర్భంగా..

    దీపావళి సందర్భంగా..

    దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి సతీసమేతంగా విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. చిరంజీవి పాదాభివందనం చేస్తూ గురువు వద్ద నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. సంప్రదాయబద్దంగా విశ్వనాథ్‌ దంపతులకు నూతన వస్త్రాలు పెట్టారు.

     క‌ల‌వాల‌నిపించింది.

    క‌ల‌వాల‌నిపించింది.

    ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. విశ్వ‌నాథ్ గారిని క‌ల‌వాల‌నిపించింది. అందుకే ఈ రోజు ఆయ‌న ఇంటికి వచ్చాను. ఆయ‌న నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారు. దీపావళి వేళ ఆయ‌నను క‌ల‌వ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. అంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు అని చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Filmibeat Telugu
    చిరంజీవిలో నటనను..

    చిరంజీవిలో నటనను..

    చిరంజీవిలో నటుడిని తెలుగు ప్రేక్షక లోకానికి విశ్వనాథ్ పరిచయం చేశారు. స్వయంకృషి, ఆపద్భాంధవుడు సినిమాలతో చిరంజీవి మరో మెట్టు ఎక్కించారు. ఈ రెండు చిత్రాలకూ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు చిరంజీవి. తన ఇమేజ్‌ను పక్కనపెట్టి విశ్వనాథ్ బాటలో నడిచాడు.

    English summary
    Chiranjeevi meets K Viswanath on Diwali occasion, Chiranjeevi along with his Wife SMT. Surekha Met Legendary Director of Indian Cinema Sri K. Vishwanadh Gaaru at His Home on the Occasion of #Diwali
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X