కరోనా ఎఫెక్ట్ : మూడు రోజుల శ్రమ, 700 మాస్క్‌లు.. అంజనాదేవీ మెగా సాయం
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు నిలవలేకపోతోన్నాయి. విరుగుడు కనిపెట్టలేకపోతుండుటంతో వేల మంది తమ ప్రాణాలను కోల్పోతోన్నారు. మన దేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో రెండు వందలకుపైగా మృత్యువాత పడ్డారు. ఇంతలా తాండవం చేస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

21 రోజుల లాక్ డౌన్..
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏప్రిల్ 14 వరకు ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు, దినసరి కూలీల పరిస్థితి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. అలాంటి వారికి అండగా ఉండేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రభుత్వాలకు అండగా..
కరోనా లాంటి కష్టకాలంలో ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని చేసేందుకు సెలెబ్రిటీలు ముందుకు వచ్చారు. తమకు తోచిన సాయాన్ని చేస్తూ ప్రభుత్వాలకు ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు మెగా ఫ్యామిలీ నుంచి భారీగా విరాళాలు వెళ్లాయి.

మెగా హీరోల సాయం..
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మెగా ఫ్యామిలీ నుంచి ఆర్థిక విరాళాలు అందాయి. సినీ కార్మికుల కోసం చిరంజీవి నిలబడగా.. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్రభుత్వాలకు ఆర్థికా సాయాన్ని ప్రకటించారు. ఇక సినీ కార్మికుల కోసం.. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలు ముందుకు వచ్చారు. తాజాగా చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవీ సైతం తన వంతు సాయాన్ని చేస్తోంది.
Recommended Video

మూడు రోజుల శ్రమ..
చిరంజీవి తల్లి అంజనమ్మ.. మూడు రోజుల పాటు శ్రమించి.. 700 మాస్క్‌లు తయారు చేసింది. కరోనా కట్టడి చేయాలంటే మాస్క్‌లు కచ్చితంగా వాడాల్సిందేనని ప్రభుత్వాలు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మాస్క్‌ల కొరత ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజనమ్మ తన వృద్దాప్యాన్ని కూడా లెక్కచేయకుండా చేతనైనా సాయాన్ని చేయడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











