ఒకే చోట కలిసిన తెలుగు స్టార్ హీరోలు: ఆ ప్రొడ్యూసర్ కోసం అంతా ఏకమై.. వేరే ఇండస్ట్రీ నుంచి ఆయన!

తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించి మాంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌గా వెలుగొందుతున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. వరుసగా సినిమాలు తీస్తూ అలరిస్తున్న ఆయన.. టాలీవుడ్‌లోని అందరు హీరోలతో కలిసిమెలసి ఉంటూ మంచి పేరును సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు అందరితో సినిమాలు నిర్మిస్తూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఆయన టాలీవుడ్‌లోని ప్రముఖులందరికీ ఘనమైన పార్టీ ఇచ్చారు. దీనికి స్టార్ హీరోలతో పాటు సినీ జంటలు కూడా వచ్చాయి. వేరే ఇండస్ట్రీ నుంచీ హాజరయ్యారు. ఆ విశేషాలు మీకోసం!

ఘనంగా దిల్ రాజు పుట్టినరోజు ఫంక్షన్

ఘనంగా దిల్ రాజు పుట్టినరోజు ఫంక్షన్

డిస్ట్రిబ్యూటర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఎంతో మంచి పేరును సంపాదించుకున్న దిల్ రాజు డిసెంబర్ 18 శుక్రవారం 50వ పడిలోకి అడుగు పెట్టారు. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే అంటే గురువారం రాత్రి పుట్టినరోజు పార్టీ నిర్వహించారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందీ ఫంక్షన్. దీనికి సినీ లోకం మొత్తం తరలి వచ్చింది.

భార్యను పరిచయం చేసిన ప్రొడ్యూసర్

భార్యను పరిచయం చేసిన ప్రొడ్యూసర్

దిల్ రాజు భార్య అనిత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి విధితమే. దీంతో 2020 మే 10న హైదరాబాద్‌కు చెందిన తేజస్వినీని వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా నిరాడంభరంగా జరిగిందీ వేడుక. దీంతో గత రాత్రి జరిగిన పుట్టినరోజు పార్టీలో తన భార్య తేజస్వినీని టాలీవుడ్‌కు పరిచయం చేశారాయన. ఈ జంటకు ప్రముఖులంతా విసెష్ చెప్పారు.

టాలీవుడ్ నుంచి వచ్చిన ప్రముఖులు

టాలీవుడ్ నుంచి వచ్చిన ప్రముఖులు

ఎంతో ఘనంగా జరిగిన దిల్ రాజు పుట్టినరోజు వేడుకకు టాలీవుడ్‌కు చెందిన హీరోలు, హీరోయిన్లు హాజరయ్యారు. మరీ ముఖ్యంగా ఈ ఫంక్షన్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు, రెబెల్ స్టార్ ప్రభాస్, విజయ్ దేవరకొండ, రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, విశ్వక్ సేన్ సహా పలువురు హీరోలు వచ్చారు. అలాగే, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్, అనుపమలు హాజరయ్యారు.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు

దిల్ రాజు యాభైవ పుట్టినరోజు వేడుకలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ కుటుంబం నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హాజరయ్యారు. వీళ్లంతా బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుకు బర్త్‌డే విసెష్ చెప్పడంతో పాటు వివాహం చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

భాగస్వామితో ఎంట్రీ ఇచ్చిన స్టార్లు వీళ్లే

భాగస్వామితో ఎంట్రీ ఇచ్చిన స్టార్లు వీళ్లే

టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలు, హీరోయిన్లు ఏకంగా చేసిన దిల్ రాజు.. అందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఇక, దీనికి కొన్ని జంటలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందులో అక్కినేని నాగ చైతన్య - సమంత జోడీతో పాటు నితిన్ తన భార్యతో కలిసి వచ్చాడు. అలాగే, దిల్ రాజు కుమార్తె తన భర్తతో కలిసి పుట్టినరోజు పార్టీని దగ్గరుండి చూసుకున్నారు.

వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన స్టార్ హీరో

వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన స్టార్ హీరో

అంగరంగ వైభవంగా జరిగిన దిల్ రాజు పుట్టినరోజు ఫంక్షన్‌కు తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు వేరే పరిశ్రమకు చెందిన వాళ్లు కూడా హాజరయ్యారు. వాళ్లెవరో కాదు.. KGF సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్‌తో పాటు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం KGF 2 షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. దీంతో వీళ్లంతా నగరంలోనే బస చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X