twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వార్త తెలిసి నిర్ఘాంతపోయాను.. అవే చివరి మాటలు.. శోభానాయుడుపై చిరంజీవి ఎమోషనల్

    |

    ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభా నాయుడు హైదరాబాద్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించారు. పద్మావతి పాత్రలో ఆమె కనిపించే శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం ఎంతో ప్రసిద్ది చెందింది. శ్రీ కృష్ణ పారిజాతంలో సత్యభామ పాత్ర కూడా ఆమె నటించిన పాత్రలలో బాగా పేరు సంపాదించుకున్నారు. ఆమెకు దేశవిదేశాలలో శిష్యులున్నారు. ఆమె కూచిపూడి నృత్య ప్రతిభకు గాను భారత ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారం ప్రదానం చేసింది. అంతటి శోభా నాయుడి మృతిపై చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

    ఆయన శిష్యురాలిగా..

    ఆయన శిష్యురాలిగా..

    ఈ రోజు ఉదయాన్నే శోభానాయుడు మరణవార్త వినగానే నేను నిర్ఘాంతపోయాను. శోభానాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కళాకారిణి ఆమె. ఆ స్థాయి కళాకారులు మళ్ళీ వస్తారా అనేది పెద్ద ప్రశ్నే. శ్రీ వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి అంటూ చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

    కరోనా సమయంలో...

    కరోనా సమయంలో...

    శోభా నాయుడు గారితో నాకు వ్యక్తి గతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రశంశించుకునే కళాకారులం.ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన సమయంలో ఆమె చేసిన ఓ నృత్య గేయం కూడాను చూశాను. అది చూసినప్పుడు నాకూ ఎంత ముచ్చట కలిగిందంటే శారీరకంగా ఇబ్బంది ఉన్నా సరే దాన్ని అధిగమించి సమాజం కోసం కరోనా గురించి స్పందించి ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఆడారు పాడారు అంటే గనుక కళాకారిణిగా ఆమెకు కళల పట్ల ఉన్న అభిమానం, సమాజం పట్ల ఉన్న అభిమానం ఎంతో అర్థమైందని చిరంజీవి అన్నారు.

    ఫోన్ చేస్తాను అని చెప్పా..

    ఫోన్ చేస్తాను అని చెప్పా..

    శోభా నాయుడు గారికి వెంటనే నా ప్రశంశలు కోటి గారి ద్వారా తెలిపాను. దానికి స్పందనగా ఆమె కూడ నాకు కృతజ్ఞత గా శుభాకాంక్షలు పంపించారు. ఇక అదే మా ఇద్దరి మధ్య జరిగిన ఆఖరి సంభాషణ. వారుఆమె నన్ను కలవాలని కూడా అనుకున్నారు. నన్ను తనతో ఓ వేదిక మీద చూడాలని కూడా ఆమె అనుకున్నారు. ఆమె నన్ను కలవాలనుకుంటున్నట్టు సంగీత దర్శకుడు కోటి నాకు ఫోన్ లో చెప్పారు. నేను కోటిని ఆమె నంబర్ అడిగి తీసుకున్నా. నేనే ఆమెకు ఫోన్ చేస్తానని కూడా చెప్పా.

    Recommended Video

    Birthday Wishes For The Bollywood Legend From Tollywood Stars
    భవిష్యత్ ప్రోగ్రాం..

    భవిష్యత్ ప్రోగ్రాం..

    ఆ తర్వాత శోభా నాయుడు నాకు ఓ వాయిస్ మెసేజ్ పంపారు. ‘మెగాస్టార్ చిరంజీవిగారికి మీ అభిమానుల మనుసుల్లో శాశ్వతంగా హీరోగా నిలిచిపోయిన మా చిరుగారికి అనేక వందనాలు. కోటి గారితో మీరు నా గురించి ప్రస్తావించిన అంశాలు విని చిన్న పిల్లలా ఎగిరి గంతేశాను. మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. గాలిలో తేలిపోయింది. మీమీద నాకున్న అభిమానం మాటల్లో చెప్పలేను. ఒకవిధంగా చెప్పాలంటే అది మాటలకందని ఆరాధన. నవరసాలను మీ కళ్లలో పలికించిచిటికెలో పండించి మా మనసుల్ని గెలిపిన మహారాజు మీరు. ఈ గడ్డుకాలం అయిపోయాక మేం చేయబోయే మొదటి ప్రదర్శనకు మీరు, కోటి గారు అతిథులుగా రావాలి' అని భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

    English summary
    Chiranjeevi pays tribute to kuchipudi dancer Shobha Naidu Death, Chiranjeevi Emotional On kuchipudi dancer Shobha Naidu Death, Chiranjeevi Condolences Shobha Naidu family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X