twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమాజం కోసం పిల్లలు వద్దనుకున్నాడు.. ఎప్పుడూ వాటిగురించే ఆందోళన.. కొరటాలపై చిరు కామెంట్స్

    |

    టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు కొరటాల శివ. దర్శకుడి తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు. ఓ సినిమాను మాస్ ఆడియెన్స్‌కు, క్లాస్ సెక్షన్‌కు ఎలా నచ్చాలో, ఎలా తెరకెక్కిస్తే వారికి నచ్చుతుందే తెలిసిన వ్యక్తి కొరటాల. ఇంతవరకు అపజయమన్నదే ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతోన్నాడు.

    అన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే..

    అన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే..

    కొరటాల శివ తెరకెక్కించిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాయి. అయితే ఈ సినిమాలన్నీ గమనిస్తే ఓ విషయం అందరికీ అర్థమవుతుంది. సమాజానికి ఉపయోగ పడే విధంగా, ఆలోచనలు రేకెత్తించేలా ఏదో ఒక సందేశాన్ని అంతర్లీనంగానో, ప్రధానంగానో చేసి సినిమాలను మలుస్తాడు.

    కొరటాలపై చిరు కామెంట్స్..

    కొరటాలపై చిరు కామెంట్స్..

    కొరటాలలోని వ్యక్తిత్వమే ఆయన సినిమాల్లో కనిపిస్తుందని చిరంజీవి చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల గురించి మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు. ఆచార్య నిమిత్తం కొరటాల శివను కలిశానని, అప్పటి నుంచే అతనితో ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చాడు.

    వాటి గురించే ఆందోళన..

    వాటి గురించే ఆందోళన..

    మొదట కలిసినప్పుడే కొరటాల లోతైన వ్యక్తిగా కనిపించాడని పేర్కొన్నాడు. సమాజం పట్ల ఎంతో అవగాహన, మేధస్సు ఉన్న వ్యక్తి అంటూ కొనియాడాడు. దిగజారుతున్న రాజకీయాలు, నాయకుల వ్యక్తిత్వాలు-ప్రవర్తన గురించి నిత్యం ఆందోళన చెందుతాడని చెప్పుకొచ్చాడు.

    సమాజం కోసం పిల్లలను కూడా..

    సమాజం కోసం పిల్లలను కూడా..

    కొరటాలలోని సేవాతత్పరత తనకు బాగా నచ్చిందని పేర్కొన్నాడు. ఆయన తన శ్రీమతితో కలిసి ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ సేవకు వెచ్చిస్తాడని సీక్రెట్ బయట పెట్టేశాడు. పిల్లలు పుడితే స్వార్దంతో సమాజానికి ఏమీ చేయలేమని.. బిడ్డలను వద్దనే కఠోర నిర్ణయం తీసుకున్న గొప్ప జంట అని ప్రశంసల వర్షం కురిపించాడు.

    English summary
    Chiranjeevi Praises Koratala siva About Helping nature. chiranjeevi Revealed Secret That Why HE Doesn't want Children.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X