అమ్మా అంటూ మహిళా పోలీస్‌పై మెగాస్టార్ ప్రశంసల వర్షం.. భావోద్వేగానికి గురైన ఉద్యోగిని!
మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే. ఓ మంచి పని చేసినా, ఓ గొప్ప చిత్రాన్ని తీసినా, ఏ నటీనటులైనా బాగా నటించినా వెంటనే మెచ్చుకుంటాడు. వ్యక్తిగతంగా మాట్లాడో, లేదా ఇంటికి పిలుపించుకుని ప్రేమగా మాట్లాడి అభినందిస్తుంటాడు. ఈ మేరకు ఇలాంటి ఘటనలెన్నో మనం చూశాం. తాజాగా ఓ పోలీస్ ఉద్యోగిని చూసి, ఆమె సేవా గుణాన్ని చూసి ముగ్దుడైపోయాడు. వెంటనే ఆమెతో మాట్లాడాలని, అభినందించాలని ప్రయత్నించాడు. ఈ మేరకు సదరు పోలీస్ ఆఫీసర్‌తో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంతకీ అసలు జరిగిందేమిటో ఓ సారి చూద్దాం.
Recommended Video

వీడియో వైరల్..
ఒడిశాకు చెందిన ఓ మహిళా పోలీసాఫర్ చేసిన సేవ సోషల్ మీడియాను కదలించింది. రోడ్డుపై పడి ఉన్న ఓ వృద్దురాలికి గోరు ముద్దలు తినిపించింది. సదరు పోలీసాఫీసర్ మంచితనానికి సోషల్ మీడియా మొత్తం ఫిదా అయింది. మెగాస్టార్ కంటపడ్డ ఈ వీడియోపై చిరు స్పందించాడు.

మాట్లాడాలని ప్రయత్నం..
సదరు మహిళా పోలీసాఫీసర్ కనబర్చిన సేవాగుణానికి ముగ్దుడైన చిరు.. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నం చేశాడట. చివరకు ఆమెతో మాట్లాడి అభినందించాడు. ఈ మేరకు ఆమెతో చేసిన సంభాషణను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అమ్మ కనబడిదని వ్యాఖ్య..
అలా వృద్దురాలికి గోరు ముద్దలు పెట్టడంపై మాట్లాడుతూ.. తనలో అమ్మ కనిపించిందని మెగాస్టార్ వ్యాఖ్యానించాడు. ఈ మాటలకు సదరు పోలీసాఫీసర్ భావోద్వేగానికి గురైంది. అలా చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని అడిగాడు. బాధ్యత అంటే కేవలం లా అండ్ ఆర్డర్ చూసుకోవడమే కాదని, పౌరులకు ఎలాంటి సాయమైన చేయాలని అదే మన కర్తవ్యవమని తనపై అధికారి చెబుతూ ఉండేవాడని తెలిపింది.

కేవలం మెగాస్టార్ మాత్రమే కాదు..
చిరు ప్రశంసలకు పొంగిపోయిన సదరు పోలీసాఫీసర్ మాట్లాడుతూ.. ‘మీరు నాతో మాట్లాడాలని అనుకుంటున్నట్టు తనపై అధికారి చెప్పినప్పుడు ఎంతో సంతోషించాను. ఎందుకుంటే మీరో మెగాస్టార్..అంతకంటే ఎక్కువగా సామాజిక సేవలు చేశారు. నేను మీ సెమినార్స్ ఎన్నో చూశాను. టూరిజం మినిస్టర్‌గా మీరెంతో చేశారు. మీరు నన్ను అభినందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్' అని ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











