బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి: హాజరైన చిరంజీవి,రాజమౌళి, రాజశేఖర్, కృష్ణంరాజు..పవన్ డుమ్మా (ఫొటోలు)
ప్రముఖ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొన్నది. తన సోదరుడు కుమారుడు పెళ్లిని వైభవంగా జరిపించారు. ఈ పెళ్లికి టాలీవుడ్‌కు చెందిన అగ్రహీరోలు కుటుంబంతో సహా హాజరయ్యారు. నూతన వధూవరులను చిరంజీవి, రాజమౌళి, కృష్ణం రాజు, శ్రీకాంత్, రాజశేఖర్ దంపతులు ఆశీర్వదించారు. ఈ పెళ్లికి హాజరైన వారు వీరే...

చిరంజీవి కుటుంబంతో బండ్ల గణేష్‌కు
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో బండ్ల గణేష్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మెగా ఫ్యామిలీకి బండ్ల భక్తుడనే విషయం తెలిసిందే. అలాంటి గణేష్ ఇంట్లో పెళ్లికి చిరంజీవి స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు.

దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీతోపాటు
దర్శకుడు రాజమౌళి సాధారణంగా పార్టీలు, వేడుకల్లో కనిపించరు. కానీ బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన వేడుకు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. తన వెంట కుమారుడు కార్తీకేయ, భార్య కూడా ఉన్నారు.

రెబల్‌స్టార్ కృష్ణంరాజు దంపతులు
బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లికి హాజరైన రెబల్‌స్టార్ కృష్ణంరాజు దంపతులు. వీరిని బండ్ల గణేష్ సాదరంగా ఆహ్వానించారు. సీనియర్ నటుడైన కృష్ణం రాజుకు ఘనంగా అతిథి మర్యాదలు చేశారు.

జీవితా రాజశేఖర్ ప్రత్యేక ఆకర్షణగా
బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన పెళ్లిలో జీవితా రాజశేఖర్ దంపతులు భాగమయ్యారు. గణేష్ కుటుంబ సభ్యుల సంతోషంలో పాలు పంచుకొన్నారు. కొత్త పెళ్లి జంటకు అభినందనలు తెలిపారు.

భార్య ఊహతో కలిసి హీరో శ్రీకాంత్
బండ్ల గణేష్ సోదరుడి కుమారుడి పెళ్లికి హాజరైన శ్రీకాంత్ దంపతులు. భార్య ఊహాతో కలిసి వచ్చిన శ్రీకాంత్ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

సతీమణితో కలిసి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం
టాలీవుడ్‌లోని హాస్యనటుల కుటుంబంలో బండ్ల గణేష్ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలానే బ్రహ్మానందంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దాంతో బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లికి భార్యతో కలిసి బ్రహ్మానందం హాజరయ్యారు. ఇటీవలే హార్ట్ సర్జరీ చేయించుకొన్న బ్రహ్మానందాన్ని పలువురు ఈ సందర్భంగా కలిశారు.

హీరో గోపిచంద్ ప్రత్యేక ఆకర్షణగా
పెళ్లికి హాజరైన హీరో గోపిచంద్. తనతో మంచి రిలేషన్ ఉన్న ఈ యంగ్ హీరో బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గుబురు గడ్డంతో స్టయిలీష్‌గా కనిపించారు.

సీనియర్ నటి జయసుధ రాకతో
బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన కల్యాణ మహోత్సవానికి సీనియర్ నటి జయసుధ కూడా హాజరయ్యారు. తెలుగుదనం ఉట్టిపడే డ్రస్సుతో మరింత ఆకర్షణీయంగా కనిపించారు.

మెగాస్టార్ చిరంజీవితో రాకతో
బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు చిరంజీవి హాజరుకావడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. పవన్ కల్యాణ్ రాకపోవడంతో చిరంజీవి ఆ లోటుు భర్తీ చేశారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి కుటుంబ సభ్యులు పోటిపడ్డారు. చాలా ఓపికగా అందరితో ఫొటోలు దిగారు.


Click it and Unblock the Notifications











