చిరంజీవి ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం.. ఒకే వేదికపై చిరు,బాలయ్య, వెంకీ సందడి..
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరన్నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎలాంటి బ్యాక్ రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తన స్వయంకృషి, పట్టుదలతో ఎదిగారు. యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. తన నటప్రస్థానంలో ఎన్నో అవార్డు అందుకున్న చిరంజీవి తాజా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు . ఇంతకీ ఆ ప్రతిష్ఠాత్మక పురస్కారమేంటో మీరు కూడా ఓ లూక్కేయండీ.
చిరంజీవి ఎలాంటి ఫిల్మీ బ్యాక్ డ్రాప్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎంతో కష్టపడి తొలిసారి 'పునాది రాళ్లు' సినిమాకు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం దక్కించుకన్నారు. ఇలా చిరంజీవీ తన కెరీర్ ప్రారంభంలో సెకండ్ హీరోగా, సహాయ నటుడిగా, విలన్‌గా నటించారు. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. చిరంజీవి తన కెరీర్ లో ఆచితూచి అడుగులేస్తూ.. వరుస హిట్లతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో మారారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక హోదా దక్కించుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఇప్పటివరకు 4 నంది అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ సౌత్ పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అలాగే.. సినీరంగంలో చిరు చేసిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో భారత ప్రభుత్వం గౌరవించింది. ఇటీవల మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా 'ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్'ను చిరంజీవి అందుకున్నారు. గత వారం మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. చిరంజీవి తన సినిమా కెరీర్ లో 156 సినిమాలో 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసినందుకు చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డులోకెక్కింది.

తాజాగా చిరంజీవికి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ)IIFA Utsavam 2024 అవార్డ్స్ 2024 వేడుకల్లో చిరు 'ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురస్కారం అందుకున్నారు. ఇదే వేడుకలో నటసింహం నందమూరి బాలకృష్ణ కు ప్రతిష్టాత్మక 'గోల్డెన్ లెగసీ' అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక స్టార్ట్ హీరోయిన్ సమంత 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకోగా.. నానికి ఉత్తమ నటుడు అవార్డు వరించింది. 'మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం దక్కించింది. ఈ వేడుకలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు దక్కించుకున్నారు. ఈ ఈవెంట్ లో టాలీవుడ్ హీరోలు వెంకటేశ్, బాలకృష్ణ, దగ్గుపాటి రాణా, సుశాంత్, ఇతర నటీనటులు సందడి చేశారు.
ఐఫా అవార్డ్స్ 2024 ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి..!!#Chiranjeevi #MegastarChiranjeevi #IIFAUtsavam2024 #IIFA2024 #IIFAawards2024 #Filmibeattelugu pic.twitter.com/CVl11GBRk3
— TeluguFilmibeat (@TeluguFilmibeat) September 28, 2024
Teja Sajja, the event brought together a galaxy of stars from across the Indian film industry, including Nasser, Bramhanandam, Priyadarshan, Priyamani, Jayaraman, Sarathkumar, Radhika, Varalaxmi, and Karan Johar.
— Ravanam Swami naidu (@swaminaidu_r) September 28, 2024
The three-day IIFA Festival celebrates the best of Indian cinema pic.twitter.com/TzeSpzjNlE
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 జాబితా(IIFA 2024 Utsavam Award Winners Full List)..
ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా - చిరంజీవి
ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా - ప్రియదర్శన్
ఉమెన్ ఆఫ్‌ది ఇయర్ - సమంత
గోల్డెన్ లెగసీ అవార్డు - బాలకృష్ణ
ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి
ఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్
ఉత్తమ నటుడు (తెలుగు)- నాని
ఉత్తమ విలన్ (తమిళం) - ఎస్‌జే సూర్య (మార్క్ ఆంటోనీ)
ఉత్తమ విలన్ (తెలుగు) - షైన్ టామ్ (దసర)
ఉత్తమ సహాయ నటుడు (తమిళం) - జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ నేపథ్య గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ నేపపథ్య గాయని - శక్తిశ్రీ గోపాలన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ విలన్ (మలయాళం) - అర్జున్ రాధాకృష్ణన్
ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ నటి (తమిళం) - ఐశ్వర్యారాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ దర్శకుడు (తమిళం) - మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) - ఏఆర్ రెహమన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి
ఉత్తమ సాహిత్యం - జైలర్ (హుకుం).


Click it and Unblock the Notifications











