నాగబాబుపై చేయి చేసుకున్న చిరంజీవి... ఏం జరిగిందంటే?

అన్నదమ్ములు ఎంత అన్యోన్యంగా ఉన్నా... ఏదో ఒక సందర్భంలో గొడవ పడటం సర్వధారణం. ముఖ్యంగా చిన్న వయసులో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సోదరుల మధ్య కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుందట.

ఇటీవల ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి తన చిన్నతనంలో జరిగిన ఇలాంటి సంఘటన గుర్తు చేసుకున్నారు. ఓసారి తమ్ముడు నాగబాబు మీద చాలా కోపం వచ్చిందని, అప్పుడు తనను తాను కంట్రోల్ చేసుకోలేక కొట్టినట్ల వెల్లడించారు.

నాగబాబు అలా నిర్లక్ష్యంగా చెప్పడంతో...

నాగబాబు అలా నిర్లక్ష్యంగా చెప్పడంతో...

చిరంజీవి ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నాగబాబు 7వ తరగతి చదువుతున్నారట. పెద్దోడు కాబట్టి ఆ సమయంలో ఇంట్లో అమ్మ ఏ పని చెప్పినా చిరంజీవి చూసుకునేవారట. ఒకరోజు లాండ్రీ నుంచి బట్టలు తీసుకురావడంతో పాటు, మరో పని ఒకేసారి చేయాల్సి రావడంతో లాండ్రీ నుంచి బట్టలు తీసుకొచ్చే పని తమ్ముడు నాగబాబుకు అప్పగించి వెళ్లారట. అయితే ఈ విషయంలో నాగబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిరంజీవికి చాలా కోపం వచ్చిందట.

తమ్ముడిని కొట్టడంతో అమ్మకు కోపం వచ్చింది

తమ్ముడిని కొట్టడంతో అమ్మకు కోపం వచ్చింది

‘నేను బయటకు వెళ్లొచ్చే సరికి లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురా' చెప్పి వెళ్లాను. కానీ నేను తిరిగి వచ్చేసరికి ఆ పని చేయకుండా నిద్ర పోయాను అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. నాకు చాలా కోపం వచ్చి తమ్ముడిని కొట్టాను. దీంతో అమ్మ నాపై కోప్పడింది. అయితే నాన్న వచ్చి మళ్లీ నాకు సపోర్ట్ ఇచ్చి తమ్ముడి నిర్లక్ష్యాన్ని మందలించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

తీపి జ్ఞాపకాలు...

తీపి జ్ఞాపకాలు...

తమ్ముడిపై చేసుకున్న ఈ సంఘటన చిరంజీవి మైండ్‌లో అలా ముద్రపడిపోయింది. తాను ఎంతగానో ప్రేమించే తమ్ముడిపై క్షణికావేశంలో చేయిచేకున్న సంఘటన చిరంజీవిని చాలా బాధించిందట. ఆ తర్వాత నుంచి తమ్ముళ్లను మరింత ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టారట.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

చిరంజీవి సినమాల విషయానికొస్తే... ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. తన బేనర్లో చరణ్ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆదారంగా రూపొందుతున్న ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ చిత్రం. ఈ మూవీ కోసం దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు అంచనా. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాసరా సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X