షాకింగ్: భారీ మల్టీస్టారర్ నుంచి చరణ్ ఔట్.. కొడుకు స్థానంలో చిరంజీవి ఫిక్స్.!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పటి హీరోలు సరికొత్త ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో టాలీవుడ్‌లోని దర్శక నిర్మాతలు మల్టీస్టారర్ మూవీలను తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ క్రమంలోనే మరిన్ని పట్టాలెక్కేందుకు రెడీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ భారీ మల్టీస్టారర్ మూవీ నుంచి రామ్ చరణ్ తప్పుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అతడి స్థానాన్ని చిరంజీవి భర్తీ చేస్తారని కూడా అంటున్నారు. వివరాలు...

రీఎంట్రీలో దూకుడు.. యంగ్‌స్టర్లకు పోటీగా చిరు

రీఎంట్రీలో దూకుడు.. యంగ్‌స్టర్లకు పోటీగా చిరు

రాజకీయాల కోసం సినిమాలకు దూరం అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ విరామం అనంతరం ‘ఖైదీ నెంబర్ 150'తో ఆయన రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో చిరంజీవి వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో కథలను విన్నారు... వింటున్నారు. నచ్చిన వాటిని ఓకే చేస్తున్నారు.

ఆ మూవీ రిజల్ట్‌తో నిరాశ... ఈ సారి పక్కా ప్లాన్

ఆ మూవీ రిజల్ట్‌తో నిరాశ... ఈ సారి పక్కా ప్లాన్

ఎన్నో అంచనాలతో తెరకెక్కిన చిరంజీవి సినిమా ‘సైరా: నరసింహారెడ్డి' ఆశించినంతగా ఆడలేదు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు మెగా అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సారి గట్టిగా కొట్టాలని చిరంజీవి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ బడా డైరెక్టర్‌ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సోషల్ మెసేజ్‌తో రూపొందుతోంది.

టైటిల్‌తో సహా అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి

టైటిల్‌తో సహా అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి

రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో చిరంజీవి నక్సలైట్‌గా నటిస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య లీకైన ఫొటోల్లో అందుకు అనుగుణంగానే ఆయన కనిపించారు. ఇక, ఈ మూవీ టైటిల్ కూడా నాటకీయ పరిణామాల మధ్య మెగాస్టార్ చిరంజీవి నోటి వెంటనే లీకైంది.

చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రామ్ చరణ్

చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రామ్ చరణ్

ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నట్లు ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని చిత్ర యూనిట్ పలుమార్లు హింట్ ఇచ్చింది. అయితే, చరణ్ పాత్ర కొద్దిసేపే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఇటీవల చిరంజీవి, కొరటాల శివ చెప్పిన వివరాల ప్రకారం.. ఇందులో అతడి రోల్ దాదాపు ముప్పై నిమిషాలు ఉంటుందట.

షాకింగ్: భారీ మల్టీస్టారర్ నుంచి రామ్ చరణ్ ఔట్

షాకింగ్: భారీ మల్టీస్టారర్ నుంచి రామ్ చరణ్ ఔట్

రామ్ చరణ్ ప్రస్తుతం RRR అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దీంతో షూటింగ్ ప్రారంభమైన వెంటనే చెర్రీ డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ఆచార్యలో అతడు నటిస్తాడా లేదా అన్న విషయం రాజమౌళి చేతిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆచార్య నుంచి చరణ్ తప్పుకున్నాడట.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
చిరంజీవి నిర్ణయం.. కొడుకు స్థానంలో మెగాస్టార్

చిరంజీవి నిర్ణయం.. కొడుకు స్థానంలో మెగాస్టార్

పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ‘ఆచార్య' నుంచి చరణ్ కోసం రాసిన పార్ట్‌ను తగ్గించాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, చరణ్‌తో చేయించాలనుకున్న పాత్రను బాగా ట్రిమ్ చేయించి ఆయనే పోషించనున్నారని అంటున్నారు. దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X