చిరంజీవి చిన్నల్లుడి మెగా హృదయం.. మంచి పని చేసి ప్రశంసలు!
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌కు నేడు(ఫిబ్రవరి11) ప్రత్యేకమైన రోజు. పుట్టినరోజు జరుపుకుంటున్న కళ్యాణ్ దేవ్ ఒక మంచి పని చేసి హాట్ టాపిక్ అయ్యారు. అవయవదానం ప్రతిజ్ఞ చేస్తూ అపోలో ఆసుపత్రి అగ్రిమెంటుపై సంతకం చేశారు.

అవయవదానం చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఇది ఒక జ్ఞాపకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ రోజును ఎంచుకున్నాను. ప్రతి ఒక్కరూ అవయవదానం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఈ అగ్రిమెంటుపై సంతకం చేసే ముందు మీ తల్లిదండ్రులు, స్నేహితుల అనుమతి కూడా తీసుకోవాలి. ఆ సమయం వస్తే... నా అవయవాలు దానం చేయాలని వారికి స్పష్టంగా చెప్పాలి. అప్పుడే అవయవదానం చేయాలనే మీ కోరిక తీరుతుందని కళ్యాణ్ దేవ్ అన్నారు.

మనం చనిపోయిన తర్వాత జరిగే అవయవదానం వల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగు నిండుతుంది. చూపులేని వారికి చూపు తెప్పించే అవకాశం ఉంటుంది, మీ వల్ల కొందరి ప్రాణాలు నిలబడతాయి. ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అన్నారు.

సినిమాల విషయానికొస్తే... కళ్యాణ్ దేవ్ తన రెండో సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నారు. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ రిజ్వాన్ ఎంటర్టెన్మెంట్స్ కొత్త పోస్టర్ విడుదల చేసింది.



Click it and Unblock the Notifications











