వైరల్ పిక్ : ఓ ఆదివారం - అమ్మ దగ్గర నేను- చెల్లెల్లు తమ్ముళ్లు.. చిరు ట్వీట్ వైరల్
గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవిలోని ఇంకో కోణాన్ని మనం చూస్తున్నాం. ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ను దున్నేస్తున్నాడు. తన అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలు అభిమానులతో, ప్రజలతో పంచుకునేందుకు ఓ సాధనం కావాలని,అందుకే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నానని చెబుతూ.. ఉగాది వంటి పర్వదినాన అభిమానులను నేరుగా పలకరించాడు.
ఉగాది రోజున మొదలైన ట్వీట్ల దండయాత్ర అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని, తన జీవితంలోని మధురానుభూతుల గురించి చెబుతూనే వస్తున్నాడు. తాజాగా చిరు షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
వెండితెరపై చిరంజీవి ఎంతలా విజృంభిస్తాడో అందరికీ తెలిసిందే. కామెడీ టైమింగ్‌లో చిరుకు ఎవ్వరూ సాటి రాలేరు. అయితే నిజ జీవితంలోనూ చిరు అందర్నీ ఆట పట్టిస్తుంటాడని ఇంత వరకు వారు వీరు చెబితేనే తెలుసుకున్నారు. కానీ సోషల్ మీడియాలో చిరు ఎంట్రీ తరువాత చిరు చలాకీ తనం అందరికీ అర్థమైంది.

ఆటపట్టించడంలోనూ..
తన తోటి నటీనటులను ఆట పట్టించడంలోనూ చిరు శైలి వేరు. తన సహచర నటుడు, ప్రాణమిత్రుడైన మోహన్ బాబును ఏ రేంజ్‌లో ఆడుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ ఎంతగానో వైరల్ అయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును సైతం..పూలు, పళ్లు అంటూ సెటైర్ వేసి ఆశ్చర్య పరిచాడు.
నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ..
చిన్న నాటి ఘటనలను, బన్నీ, చరణ్‌లతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ వారి పుట్టిన రోజులకు షేర్ చేసిన ఫోటోలు, చేసిన ట్వీట్స్ తెగ వైరల్ అయ్యాయి. తన జీవితంలోని ముఖ్య ఘటనలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు చిరు.
Recommended Video

తాజాగా ఓ ఫోటో..
మెగా ఫ్యామిలీ ప్రతీ ఆదివారం ఒక్క చోట కలిసి సందడి చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుండటంతో అందరూ కలవడం సాధ్యపడటం లేదు. ఈ సందర్భంగా నాటి రోజులను చిరు మిస్ అవుతున్నట్టు కనిపిస్తోంది. లాక్ డౌన్ విధించడానికి ముందటి ఆదివారం రోజు దిగిన ఫోటోను షేర్ చేశాడు. అందులో నాగబాబు, పవన్ కళ్యాణ్, ఇాద్దరు చెల్లెళ్లు, అమ్మ అంజనా దేవీ ఉన్నారు. ఓ ఆదివారం - అమ్మ దగ్గర నేను- చెల్లెల్లు తమ్ముళ్లు అంటూ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











