వైకుంఠపురం అంటే ఇదేనేమో.. చిరంజీవి ఇంటిని చూస్తే షాక్.. మెగాస్టార్ వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకు పరిచయం అక్కర్లేదు. భారత సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. కొన్ని దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా చిత్రసీమను ఏలేస్తున్నాడు. మరి అలాంటి మారాజుకు ఎలాంటి కోట ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా చిరంజీవి షేర్ చేసిన ఓ వీడియో చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

Recommended Video

Megastar Chiranjeevi Emotional Message To People
 శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తొమ్మిదో రోజు లాక్ డౌన్ ఇలా మొదలైందంటూ చిరంజీవి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇంట్లోనే ఉండండి క్షేమంగా ఉండండని తెలిపాడు. చిరు షేర్ చేసిన వీడియోలో ఉన్న ఇంటిని, స్విమ్మింగ్ పూల్‌ను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

ఇప్పటికైనా రియలైజ్ కావాలి..

ఇప్పటికైనా రియలైజ్ కావాలి..

``అందమైన సన్ రైజ్... ఉదయం లేచాక ఎంత ప్రశాంతంగా ఉందో.. కాలుష్యం లేక సిటీ అందంగా కనిపిస్తోంది.. పక్షుల కిలకిలా రావాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.. దీనిని బట్టి చూస్తుంటే మనం ఎంత మిస్సయిపోతున్నామో? ఈ దైనందిన జీవితంతో.. మన భూమిని మనమే పాడు చేసుకుంటున్నాం. కోరి పోగొట్టుకుంటున్నామనిపిస్తోంది. ఇప్పటికైనా రియలైజ్ కావాలి. నేచుర్ ని కాపాడుకోవాలి`` ..

ఆకట్టుకున్న నిర్మాణం..

చిరంజీవికి ప్రకృతి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొని.. మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఉదయం లేవగానే చేసే పని ఇదేనంటూ.. మొక్కలకు నీరు పడుతున్న ఫోటోను షేర్ చేశాడు. అయితే తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో ఆయన ఇంటి నిర్మాణం అందర్నీ ఆకట్టుకుంది.

నిజంగానే ఇంద్రభవనం..

నిజంగానే ఇంద్రభవనం..

బయట నిల్చుని సూర్యోదయాన్ని చూపిస్తూ.. అలాగే ఇంటిని, స్విమ్మింగ్‌పూల్‌ను చూపెట్టాడు. ఆ ఇంటి నిర్మాణాన్ని చూస్తే ఇంద్రభవనం, వైకుంఠపురం అంటే ఇదేనేమోనన్న అనుమానం కలగక మానదు. ప్రస్తుతం చిరు షేర్ చేసిన ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. దాదాపు వంద కోట్లతో చిరు తన అభిరుచికి తగ్గట్టు ఇంటిని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X