బుల్లి పవర్ స్టార్‌ను బంధించిన వేళ.. మెగాస్టార్ మామూలోడు కాదు!!
మెగాస్టార్ చిరంజీవి మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చదువుకునే సమయంలోనే కల్చర్ ప్రోగ్రామ్స్, ఎన్‌సీసీ వంటి వాటిలో చురుగ్గా పార్టిసిపేట్ చేసేవాడు. అలాంటి చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టమే. తన సినిమా విషయంలోనూ కెమెరామెన్, డీఓపీ విషయంలో చిరు జాగ్రత్తలు వహిస్తుంటాడు. ఫోటోగ్రఫీపై మక్కువ, పట్టు ఉండటంతోనే ఆ విభాగాల్లోనూ కాసింత చొరవ తీసుకుంటాడు. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా చిరంజీవి అత్యంత అపురూపమైన, మొదటగా తీసిని ఫోటోను షేర్ చేశాడు.
నేటి వరల్డ్ ఫోటో గ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. మొదటగా ఓ హింట్ ఇచ్చి మరీ అందరిలోనూ ఉత్సాహాన్ని నింపాడు. మొదటగా తాను వాడిన కెమెరాను పరిచయం చేశాడు. ఆపై మొదటగా తీసిన ఫోటోను షేర్ చేశాడు. ఈ మేరకు చిరు చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. 'ఇవ్వాళ #WorldPhotographyDay నేను మొదటి ఫోటో తీసింది ఇలాంటి #agfa3 కెమెరాతో. ఆ మొదటి ఫోటో మరి కాసేపటిలో.... ...' అంటూ అంతకంతకూ ఊరించాడు.

ఇక కాసేపటి క్రితమే చిరు తీసిన మొదటి ఫోటోను అందరికీ పరిచయం చేశాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. నేను తీసిన మొదటి ఫోటో ... ... ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు ... ...చెప్పుకోండి చూద్దాం. అంటూ క్విజ్ పోటీని పెట్టేశారు. కానీ అందులో ఉన్నది ఎవరన్నది అందరూ చిటికెలో పట్టేశారు. బుల్లి పవర్ స్టార్ ఇచ్చిన ఆ క్యూట్ పోజును, అందరిలోకెల్లా ఎంతో అందంగా ఉన్న బుల్లబ్బాయ్ పవన్ కళ్యాణ్ అని అందరూ గుర్తు పట్టారు. ఇలా బుల్లి పవర్ స్టార్‌ను తన కెమెరాలో మెగాస్టార్ చక్కగా బంధించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











