కంట్రోల్‌లో ఉంచమని చరణ్‌కు చిరంజీవి వార్నింగ్.. బడా డైరెక్టర్‌లో పెరుగుతున్న టెన్షన్

By Manoj

Recommended Video

Megastar Chiranjeevi Sweet Warning To Ram Charan

vమెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు టాప్ హీరోగా వెలుగొందిన వ్యక్తి. స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన.. తక్కువ సమయంలోనే అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయారు. అప్పటి నుంచి చిరంజీవికి తిరుగు లేకుండా పోయింది. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన.. 'ఖైదీ నెంబర్ 150'తో మరోసారి సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన దృష్టంతా సినిమాల మీదే ఉంది. ఈ నేపథ్యంలో చిరు.. తన కుమారుడు చరణ్‌కు వార్నింగ్ ఇచ్చారట. వివరాల్లోకి వెళ్తే..

ఎక్కడ చూసినా చిరంజీవే కనిపిస్తున్నారు

ఎక్కడ చూసినా చిరంజీవే కనిపిస్తున్నారు

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు. తన సినిమాలతోనే కాకుండా.. ఇతర హీరోల చిత్రాలను సైతం ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక ఫంక్షన్‌కు హాజరవుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన హాట్ టాపిక్ అవుతున్నారు.

చిరు, చరణ్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది

చిరు, చరణ్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చినప్పటికీ.. వాటిని అందుకోలేకపోయింది. ఫలితంగా సినిమా నష్టాలను మిగిల్చింది. దీంతో అటు హీరో చిరంజీవి.. ఇటు నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్ నిరాశకు గురయ్యారు.

ఆయనపైనే భారం.. జాగ్రత్తలు తీసుకుంటున్నాడు

ఆయనపైనే భారం.. జాగ్రత్తలు తీసుకుంటున్నాడు

‘సైరా' షూటింగ్ జరుపుకుంటుండగానే మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి. బడా డైరెక్టర్ కావడంతో ఈ సినిమా భారం అంతా కొరటాల పైనే పడిపోయింది. దీంతో అన్నీ పక్కాగా ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

కథ.. చిరు పాత్రలు.. రెమ్యూనరేష్ వివరాలివే

కథ.. చిరు పాత్రలు.. రెమ్యూనరేష్ వివరాలివే

ఈ సినిమా కూడా కొరటాల గత చిత్రాల మాదిరిగా సోషల్ మెసేజ్‌తో ఉంటాయని అంటున్నారు. దీని కథ అంతా దేవాదాయ భూముల చుట్టూ తిరుగుతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా కోసం ఆయన రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

 కంట్రోల్‌లో ఉంచమని చరణ్‌కు చిరంజీవి వార్నింగ్

కంట్రోల్‌లో ఉంచమని చరణ్‌కు చిరంజీవి వార్నింగ్

రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150', ‘సైరా: నరసింహారెడ్డి' చిత్రాలను రామ్ చరణే నిర్మించాడు. వీటిలో సైరాకు భారీ బడ్జెట్ పెట్టాడు. ఫలితంగా నష్టాలు మిగిలాయి. ఈ సారి అలా కాకుండా ఉండేందుకు చిరంజీవి రంగంలోకి దిగారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. బడ్జెట్‌ను కంట్రోల్ ఉంచమని చరణ్‌కు వార్నింగ్ ఇచ్చారని సమాచారం.

 చిరు కండీషన్స్.. బడా డైరెక్టర్‌లో పెరుగుతున్న టెన్షన్

చిరు కండీషన్స్.. బడా డైరెక్టర్‌లో పెరుగుతున్న టెన్షన్

ఒకపక్క బడ్జెట్‌లో పరిమితులు పెట్టుకోమని చిరు వార్నింగ్ ఇవ్వడంతో పాటు సినిమాను 90 రోజుల్లోనే పూర్తి చేయాలని కండీషన్ పెట్టడంతో కొరటాల శివలో టెన్షన్ పెరిగిపోతోందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. చిరు పెడుతున్న కండీషన్ల వల్ల ఆయన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని అంటున్నారు. దీంతో ఈ మూవీ హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X