పవన్ కల్యాణ్ సినిమాలో చిరంజీవి: అన్నయ్య అడగ్గానే ఒప్పేసుకున్న పవర్ స్టార్!

By Manoj Kumar P

ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీని ఇస్తూ.. టాప్ ప్లేస్‌పై కన్నేసి ఉంచాడు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల కోసం తీసుకున్న గ్యాప్‌ను మరిపించేందుకు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు వరుస సినిమాలతో దూకుడు చూపించినట్లుగా... ఇప్పుడు కూడా తీరిక లేకుండా కొత్త కొత్త కథలను వింటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

అనుమానాలను పటాపంచలు చేసింది

అనుమానాలను పటాపంచలు చేసింది

రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150'తో ఆయన రీఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అనుమానాల నడుమ విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా తనలో ఏమాత్రం పవర్ తగ్గలేదని నిరూపించారు చిరు. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం నిరాశనే మిగిల్చింది.

హిట్ కోసం ఆచార్యగా మారిన చిరంజీవి

హిట్ కోసం ఆచార్యగా మారిన చిరంజీవి

‘సైరా' ఫలితంతో నిరాశకు లోనైన చిరంజీవి.. ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్ హిట్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. మ్యాట్నీ మూవీస్, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్. ఈ చిత్రానికి ‘ఆచార్య' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో చిరు నక్సలైట్‌గా నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో అతడు దాదాపు ముప్పై నిమిషాలు కనిపిస్తాడని అంటున్నారు. దేవాదాయ భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం చేసే నక్సలైట్‌గా మెగా పవర్ స్టార్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి దూకుడు.. ఏకంగా ముగ్గురు

చిరంజీవి దూకుడు.. ఏకంగా ముగ్గురు

రీఎంట్రీలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే రెండు సినిమాలను పూర్తి చేసి, మరో దానిని పట్టాలెక్కించేసిన ఆయన... త్వరలోనే మరిన్ని చిత్రాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘సాహో' ఫేం సుజిత్, బాబీ, మెహర్ రమేష్‌తో సినిమాలు చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఒకటి తెలిసిపోయింది.. రెండు సస్పెన్స్

ఒకటి తెలిసిపోయింది.. రెండు సస్పెన్స్

ప్రస్తుతం ‘ఆచార్య' సినిమా చేస్తున్న చిరంజీవి... త్వరలోనే ముగ్గురు దర్శకులతో ప్రాజెక్టులు చేయబోతున్నట్లు చెప్పారు. ఇందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్' రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. దీన్ని సుజిత్ తెరకెక్కించబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, బాబీ, మెహర్ రమేష్ ప్రాజెక్టులపై మాత్రం క్లారిటీ రాలేదు.

పవన్ కల్యాణ్ సినిమాలో చిరంజీవి

పవన్ కల్యాణ్ సినిమాలో చిరంజీవి

చిరంజీవి త్వరలోనే పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీనిని పురస్కరించుకుని కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన.. మెహర్ రమేష్‌తో చేయబోయే సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇది పవన్ కల్యాణ్ చేద్దామనుకుని రీమేక్ రైట్స్ తీసుకున్న తమిళ చిత్రం ‘వేదాళం' అని సమాచారం.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
అడగ్గానే ఒప్పేసుకున్న పవర్ స్టార్.!

అడగ్గానే ఒప్పేసుకున్న పవర్ స్టార్.!

శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన చిత్రం ‘వేదాళం'. 2015లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో అప్పటి నుంచి పవన్ ఈ మూవీపై కన్నేశాడు. ఈ క్రమంలోనే దీన్ని రీమేక్ చేయడానికి సన్నిహిత నిర్మాతతో రైట్స్ కొనిపించాడు. ఇప్పుడా సినిమానే చిరు చేయాలని చూస్తున్నాడట. దీంతో ఆయన పవన్‌ను అడగడం.. రైట్స్ ఇచ్చేయడం జరిగాయని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X