లూసీఫర్, వేదాళం తర్వాత మరో రీమేక్‌లో మెగాస్టార్: పవన్ సాయంతో చిరంజీవి భారీ సాహసం.!

By Manoj Kumar P

దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన... బడా హీరోలతో పోటీలో నిలబడి స్టార్‌గా ఎదిగిపోయారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నారు. ఆ మధ్య రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన ఆయన.. రీఎంట్రీలోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే లూసీఫర్, వేదాళం తర్వాత మరో రీమేక్‌కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

కమ్‌బ్యాక్ మూవీతో అదరగొట్టేశాడు

కమ్‌బ్యాక్ మూవీతో అదరగొట్టేశాడు

మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే, ఈ మూవీతో తనలోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని చిరు నిరూపించాడు. అయితే, దీని తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం నిరాశనే మిగిల్చింది.

చరణ్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీలో

చరణ్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీలో

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య' అనే సినిమా చేస్తున్నాడు. సొంత బ్యానర్‌లో రాబోతున్న ఈ మూవీలో రామ్ చరణ్ కూడా కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. దేవాదాయ భూముల ఆక్రమణపై రూపొందుతోన్న ఈ సందేశాత్మక చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇందులో కాజల్ హీరోయిన్.

Recommended Video

Actor Kaikala Satyanarayana Thanking Megastar Chiranjeevi & Pawan Kalyan | Filmibeat Telugu
అన్నీ లైన్‌లో పెట్టేస్తున్న మెగాస్టార్

అన్నీ లైన్‌లో పెట్టేస్తున్న మెగాస్టార్

‘ఆచార్య' షూటింగ్ జరుగుతుండగానే మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్' రీమేక్ హక్కులను కొన్న ఆయన... ‘వేదాళం' మూవీని కూడా తెలుగులో చేయబోతున్నాడు. వీటితో పాటు బాబీతోనూ ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. అలాగే, మరికొన్ని కథలనూ వింటున్నాడీ సీనియర్ హీరో.

సరికొత్త ప్రయోగం చేయనున్న చిరు

సరికొత్త ప్రయోగం చేయనున్న చిరు

రీఎంట్రీలో స్పీడు చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా వరుసగా సినిమాలు ఒప్పుకుంటోన్న ఆయన... అందుకు తగ్గట్లుగానే దర్శకులనూ ఎంపిక చేసుకుంటున్నారు. మరోవైపు, తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేయనున్నారు. ఇందులో భాగంగానే ఓ మూవీ కోసం గుండుతో కనిపించనున్నారాయన.

లూసీఫర్, వేదాళం తర్వాత మరో రీమేక్‌

లూసీఫర్, వేదాళం తర్వాత మరో రీమేక్‌

తన రీఎంట్రీనే రీమేక్ మూవీతో మొదలుపెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. దీని తర్వాత ‘లూసీఫర్', ‘వేదాళం' చిత్రాలను కూడా తెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవి పట్టాలు ఎక్కకుండానే మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టేసుకున్నారు చిరు. అదే... గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘ఎన్నై అరిదాల్'. దీన్నే మెగాస్టార్ రీమేక్ చేయనున్నారని తాజా సమాచారం.

పవన్ సాయంతో మెగాస్టార్ సాహసం.!

పవన్ సాయంతో మెగాస్టార్ సాహసం.!

‘ఎన్నై అరిదాల్'ను ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మించారు. ఈయనే పవన్ - క్రిష్ మూవీనీ నిర్మిస్తున్నారు. పవర్ స్టార్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతోనే రీమేక్‌ హక్కులను చిరంజీవికి ఇవ్వబోతున్నారని సమాచారం. ఇక, ఈ మూవీ తెలుగులోనూ ‘ఎంతవాడుగానీ' అనే టైటిల్‌తో వచ్చింది. అంటే ఇక్కడ రిలీజ్ అయిన సినిమాతో చిరు సాహసం చేయబోతున్నారన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X