సినీ రంగంలో ఆడపిల్ల సెంటిమెంట్: బాలయ్య నుంచి చరణ్ వరకు.. ఎన్టీఆర్ మాత్రమే భిన్నంగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున 1.49 గంటలకు మెగా ప్రిన్సెస్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. దీంతో చిరంజీవి ఫ్యామిలీతో పాటు వాళ్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందరూ ఆ చిన్నారికి ఈ వరల్డ్‌లోకి సాదార స్వాగతం పలుకుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ హవానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చరణ్ కంటే ముందు మొదటి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోల గురించి తెలుసుకుందాం పదండి!

ఆ ముగ్గురు స్టార్ హీరోలకు: మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. అందులో మొదటిగా ఆడపిల్లే సుస్మిత జన్మించింది. ఆమె తర్వాత చరణ్, శ్రీజలు పుట్టారు. అలాగే, బాలయ్య కూడా మొదటి సంతానంతో బ్రహ్మణికి జన్మనిచ్చారు. ఆ తర్వాత తేజస్వీ, మోక్షజ్ఞలు జన్మించారు. ఇక, వెంకటేష్ మొత్తంగా నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. అందులో మొదటి సంతానంగా ఆడపిల్లే పుట్టింది.

 Chiranjeevi To Ram Charan

మోహన్ బాబు.. రవితేజకు: కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు కూడా మొదటిగా ఆడపిల్ల (లక్ష్మి ప్రసన్న) జన్మించింది. ఆ తర్వాత విష్ణు, మనోజ్‌ కుమార్‌లు పుట్టారు. వీరిలో లక్ష్మి ప్రసన్న, మంచు విష్ణుకు కూడా మొదటి సంతానంగా అమ్మాయిలే పుట్టారు. అలాగే, జీవితా రాజశేఖర్ దంపతులు కూడా మొదటి ఆడపిల్లకే జన్మనిచ్చారు. వీళ్లకు రెండో సంతానంగా కూడా అమ్మాయే జన్మించిన సంగతి విధితమే.

 Chiranjeevi To Ram Charan

హిందీలోని ఆ హీరోలకూ: సౌతిండియాలోని స్టార్లకే కాదు.. బాలీవుడ్‌లోని చాలా మంది హీరోలకు కూడా మొదటి సంతానంగా అమ్మాయిలే జన్మించారు. అందులో అనిల్ కపూర్, అజయ్ దేవగణ్, సైఫ్ అలీ ఖాన్, అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్‌లు కూడా ఆడబిడ్డకే జన్మించారు. వీళ్లలో కొందరు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్లుగా సత్తా చాటుతోన్నారన్న విషయం తెలిసిందే.

సౌత్ స్టార్లకు కూడా పాపలే: కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరికీ ఇద్దరేసి చొప్పున అమ్మాయిలు జన్మించారు. అందులో కమల్ కూతుళ్లు శృతి, అక్షర హీరోయిన్లుగా సందడి చేస్తుండగా.. రజినీ డాటర్లు సౌందర్య, ఐశ్వర్య ఇద్దరూ దర్శకులుగా సత్తా చాటుతున్నారు. ఇక, మరో స్టార్ మమ్ముట్టికి కూడా మొదటి సంతానంగా కూతురే జన్మించింది.

 Chiranjeevi To Ram Charan

రవితేజతో పాటు వాళ్లకూ: రవితేజ దంపతులు కూడా మొదట ఆడపిల్లకే జన్మనిచ్చారు. ఆ పాపకు మోక్షద అని పేరు పెట్టారు. ఆ తర్వాత మహాధన్ జన్మించాడు. వీళ్లు మాత్రమే కాదు.. అల్లరి నరేష్, ఆది సాయి కుమార్, నందమూరి తారకరత్న సహా ఎంతో మంది హీరోలు కూడా మొదటి సంతానంగా ఆడపిల్లకే జన్మనిచ్చారు. అయితే, వీరిలో కొందరు మాత్రం రెండో సంతానంగా అబ్బాయిలకు జన్మనిచ్చారు.

 Chiranjeevi To Ram Charan

టాలీవుడ్ స్టార్లు.. ఎన్టీఆర్: టాలీవుడ్‌లోని ఇప్పటి స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ మాత్రం మొదటి సంతానంగా అబ్బాయికే జన్మనిచ్చారు. ఆ తర్వాత వీళ్లకు పాపలు పుట్టారు. వీరందరిలోనూ జూనియర్ ఎన్టీఆర్ దంపతులు మాత్రం రెండు సంతానాల్లోనూ ఇద్దరు బాబులకే జన్మనిచ్చారు. మొత్తానికి చరణ్‌కు పాప పుట్టడంతో ఇప్పుడు ఎన్నో అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X