Just In
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రామ్ చరణ్‌కు షాకిచ్చిన చిరంజీవి: ఊహించని పరిణామంతో మెగా ఫ్యాన్స్‌లో అయోమయం
దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ మధ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన.. రాజకీయాల కోసం వాటిని పక్కన పెట్టేశారు. ఇక, 'ఖైదీ నెంబర్ 150'తో మరోసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కమ్‌బ్యాక్ అయిన తర్వాత వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ చిరంజీవి దూకుడు ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు రామ్ చరణ్‌కు భారీ షాక్ ఇచ్చారాయన. దీంతో ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

తండ్రి కోసం చరణ్ ద్విపాత్రాభినయం
రాజకీయాల్లో ఉన్న సమయంలో చిరంజీవి లేని లోటు టాలీవుడ్‌లో బాగా కనిపించింది. దీంతో ఆయన రీఎంట్రీ కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా వేచి చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ నిర్మాతగా మారిపోయి తండ్రితో ‘ఖైదీ నెంబర్ 150' ద్వారా రీఎంట్రీ ఇప్పించాడు. అదొక్కటే కాదు.. అప్పటి నుంచి చిరు నటించిన, నటిస్తున్న సినిమాలన్నీ స్వయంగా నిర్మిస్తున్నాడు.

చిరంజీవి - చరణ్ కాంబోలో మూవీ
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య' అనే సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో చిరు.. నక్సలైట్‌గా కనిపించబోతున్నాడు. దేవాదాయ భూముల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీన్ని మ్యాట్నీ మూవీస్ సంస్థతో కలిసి చరణ్ నిర్మిస్తున్నాడు.

యమ యాక్టివ్ అయిపోయిన చిరు
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి ఎంతగానో యాక్టివ్ అయ్యారు. సినీ పరిశ్రమకు ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్న ఆయన.. ఇండస్ట్రీ బాగోగులు దగ్గరుండి చూసుకుంటున్నారు. కీలక సమయంలో సినీ కార్మికులకు అండగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారాయన. ఆ మధ్య ట్విట్టర్‌లో ఖాతా తెరిచిన చిరు.. వరుస ట్వీట్లతో అలరిస్తున్నారు.

మొదట రామ్ చరణ్‌నే అనుసరించి
ట్విట్టర్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రతి విషయంపై ఎంతో వేగంగా స్పందిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అదే సమయంలో సినీ ప్రముఖులు పుట్టినరోజులు, సినిమాకు సంబంధించిన విషయాలను స్వయంగా పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆయనను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి... ట్విట్టర్‌లో రామ్ చరణ్‌ను ఫాలో అయ్యారు.

రామ్ చరణ్‌కు భారీ షాక్ ఇచ్చాడు
సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రతి విషయాన్ని ట్విట్టర్ ద్వారానే వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఫాలో అయ్యే వారి సంఖ్య 8 లక్షలు దాటిపోయింది. అయితే, చిరంజీవి మాత్రం ఇప్పుడు ఎవరినీ ఫాలో అవడం లేదు. అవును.. గతంలో రామ్ చరణ్‌ను ఫాలో అయిన ఆయన.. ఈ మధ్య అన్‌ఫాలో చేశారు.

ఆ దర్శకుడిని కూడా పక్కన పెట్టి
రామ్ చరణ్‌ను అన్‌ఫాలో చేసిన చిరంజీవి.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని మాత్రం ఫాలో అయ్యారు. ఈ విషయం బాగా వైరల్ అవడంతో ఆయనను కూడా అన్‌ఫాలో చేశారు. దీంతో ప్రస్తుతం ఆయన ట్విట్టర్‌లో ఎవరినీ ఫాలో అవడం లేదు. మరోవైపు, చరణ్ మాత్రం చిరంజీవి, పవన్‌ను ఫాలో అవుతున్నాడు. మెగాస్టార్ చేసిన పనితో ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు.