twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరూ బక్రాలు అయ్యారు.. ‘గుండు’ గుట్టు రట్టు.. మెగాస్టార్ మామూలుడో కాదు!!

    |

    మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య అందర్నీ షాక్‌కు గురి చేశాడు. గుండు లుక్కులో దర్శనమిచ్చి వారవ్వా అనిపించాడు. ఆ మధ్య మీసం తీసేసి యంగ్ లుక్‌లోకి మారిపోయిన చిరు.. తాజాగా అర్భన్ మాంక్ అంటూ గుండుతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అయితే అందరూ చిరంజీవి గుండు చేయించుకున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇంకొందరు మాత్రం అది మేకప్ అంటూ కామెంట్స్ చేశారు. ఆ గుండు వెనుకున్న అసలు కథను చిరు రివీల్ చేశాడు.

     ఆచార్యతో బిజీగా..

    ఆచార్యతో బిజీగా..

    మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబోలో రాబోతోన్న ఆచార్య చిత్రంపై ఎన్ని అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఈ పాటికే సినిమా విడుదలై రికార్డులు బద్దలు కావాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. కరోనా ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో షూటింగ్ వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనలో చిరు ఉన్నాడు.

    కొత్త ప్రాజెక్ట్‌లపై చర్చ..

    కొత్త ప్రాజెక్ట్‌లపై చర్చ..

    ఈ సమయాన్ని ఇలా ఊరికే వదిలేయకుండా తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో మెహర్ రమేష్, బాబీ వంటి దర్శకులకు చాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చిరు రీమేక్‌లపైనే శ్రద్ద పెట్టినట్టు తెలుస్తోంది. మళయాలి హిట్ చిత్రం లూసిఫర్, తమిళ హిట్ చిత్రం వేదాలంలపై చిరు గురి పెట్టినట్టు కనిపిస్తోంది.

    కొత్త లుక్..

    కొత్త లుక్..

    చిరు తన తదుపరి చిత్రాల కోసం కొత్త లుక్కును ట్రై చేస్తోన్నట్టు కనిపిస్తోంది. పాత్ర కోసం ఎలాంటి రూపంలో మారడానికైనా చిరు ముందుంటాడు. అయితే చిరు చేసే ప్రయోగాలు అంతగా ఫలితాలను ఇవ్వలేదు. అందుకే ఈ సారి మాత్రం ముందే జాగ్రత్త పడదామని అనుకున్నాడు. అందుకోసమే గుండు లుక్కును పోస్ట్ చేసి షాక్ చేసేశాడు.

    గుండు లుక్‌పై భిన్న కామెంట్స్..

    గుండు లుక్‌పై భిన్న కామెంట్స్..

    చిరు గుండు లుక్‌ను షేర్ చేస్తూ.. అర్బన్ మాంక్ (సన్యాసి) అంటూ ఓ స్టైలీష్ కామెంట్ పెట్టాడు. అయితే ఈ గుండుపై లెక్కలేనన్ని అనుమానాలు పుట్టుకొచ్చాయి. అది ప్రోస్థటిక్ అని కొందరు లేదు లేదు అది నిజంగానే గుండు చేయించుకున్నాడని మరి కొందరు కామెంట్ చేశారు. చాలామంది మాత్రం అది నిజమైన గుండుగానే భావించారు.

    Recommended Video

    Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
    బక్రాలను చేసేశాడు..

    బక్రాలను చేసేశాడు..

    ఇక అందరూ బక్రాలు అయినట్టు ప్రూవ్ అయింది. అది ప్రోస్థటిక్ మేకప్. దీనికోసం చిరు గంటల తరబడి అలానే కూర్చున్నట్టు కనిపిస్తోంది. కానీ ఏదీ ఏమైనా అది నిజం గుండులా అనిపించడం, అది కూడా బాగానే వైరల్ అవ్వడం జరిగింది. ఈ లుక్‌తో ఏదైనా ప్రయోగం చేయెచ్చన్న భరోసా అయితే వచ్చింది. మరి చూడాలి రానున్న రోజుల్లో చిరు గుండుతో తెరపై కనిపిస్తాడో లేదో.

    English summary
    Chiranjeevi urban Monk Look Secret Revealed, urban Monk Look Make up Video Out.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X