ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో...అందరి అభిమానం ఇలాగే పొందాలి.. బాలయ్యకు చిరు విషెస్
నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సినీ హీరోలు, దర్శక నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, హీరోయిన్లు ఇలా ప్రతీ ఒక్కరూ బాలయ్య బాబుకు విషెస్ తెలుపుతున్నారు. ఇక నందమూరి ఫ్యాన్స్ ట్వీట్లతో తెగ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలిపాడు. చిరు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
నందమూరి విషెస్..
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బాబాయ్ బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. తనలోని అభిమానాన్ని తట్టి లేపింది, చూసిన మొట్టమొదటి హీరో బాలయ్యేనని ఎన్టీఆర్ ట్వీట్ చేయగా.. తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉన్నారని కళ్యాణ్ రామ్ భావోద్వేగానికి లోనయ్యారు.

కదిలిన టాలీవుడ్
ఇక బాలయ్యకు విషెస్ చెప్పడానికి టాలీవుడ్ మొత్తం కదిలింది. దర్శక నిర్మాతలందరూ బాలయ్యపై తమ ప్రేమను కురిపించారు. సీనియర్, యువ దర్శకులందరూ బాలయ్యకు విషెస్ తెలిపారు. ఇక నిర్మాతలు, తెలుగు పరిశ్రమలో పలు నిర్మాణ సంస్థలన్నీ బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపాయి.

వివాదం రావడంతో..
ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపడంపై బాలయ్యచేసిన కామెంట్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ కామెంట్స్ కాస్తా.. మెగా నందమూరి వార్‌గా మారింది. దీంతో చిరంజీవి బాలయ్యకు విషెస్ చెబుతారా? లేదా? అందరూ అనుమానం వ్యక్తం చేశారు.
Recommended Video

అందరి అభిమానం ఇలాగే పొందాలి..
అయితే చిరంజీవి బాలయ్యకు విషెస్ తెలిపి.. తామంతా ఒక్కటే అని నిరూపించాడు. ‘60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను'అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











