మేమంతా రుణపడి ఉంటాము...పూల వర్షంపై స్పందించిన చిరు
ప్రపంచమంతా కరోనా గుప్పిట చిక్కుకుని ఉంది. దాదాపు 40 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడగా.. రెండు లక్షలకు పైగా ప్రాణాలను కోల్పోయారు. రోజురోజుకూ పరిస్థితి విషమించిపోతోన్నా ఈ పోరాటంలో వైద్యులు, వైద్య బృందం వెనకడుగు వేయడం లేదు. వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్న డాక్లర్లకు సైతం కరోనా సోకుతోంది. అయినా సరే వారి ప్రాణాలను లెక్కచేయకుండా మనందరి కోసం పోరాడుతూనే ఉన్నారు.
కరోనా నుంచి మన సమాజాన్ని రక్షించేందుకు వైద్య సిబ్బంది చేస్తున్న పోరాటాన్ని, వారి సేవలను గుర్తించాలని, అందుకు కోసం యావత్ భారతవని కరతాళ ధ్వనులు చేయాలని ప్రధాని పిలుపునివ్వగా అది ఎంతో విజయవంతమైంది. తాజాగా వైద్యులను భారత వాయు సేన గౌరవించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.

గాంధీ ఆసుపత్రిలోని వైద్యులపై పూల వర్షం కురిపించారు. ఇందు కొరకు భారత వాయు సేన హెలీ కాప్టర్ ద్వారా పూల వర్షాన్ని కురిపించింది. దీనిపై స్పందించిన చిరు.. 'సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల పైన పోరాడి, దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపైన దాడి చేస్తుంటే, అహర్నిశం మనల్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యబృంధానికి పుష్పాభివందనం చేయటం అభినందనీయం. మేమంతా మీకు రుణపడి ఉంటామ'ని ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











