పవన్ ఫ్యాన్స్ మనసు మార్చేందుకు వర్మ ప్లాన్.. ‘పవర్ స్టార్‌’లో ఆ సీనే హైలైట్.!

By Manoj

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న వారిలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒకడు. దీనికి కారణం ఆయన రాజకీయ నేపథ్యమున్న కథలతో సినిమాలు తెరకెక్కించడమే. అంతేకాదు, ఆయా చిత్రాల్లో కొందరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు. అందుకే ఆర్జీవీ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఒకవైపు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న ఏమాత్రం జంకకుండా అదే తరహా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'పవర్ స్టార్' అనే సినిమా చేశాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

Recommended Video

#PowerStar : Pawan Kalyan Fans ను కూల్ చేసేలా RGV ప్లాన్! || Oneindia Telugu
అవన్నీ అయిపోయాయి.. ఇప్పుడు పవర్ స్టార్

అవన్నీ అయిపోయాయి.. ఇప్పుడు పవర్ స్టార్

ఒకప్పుడు మంచి మంచి చిత్రాలను తెరకెక్కించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే, కొన్నేళ్లుగా ఆయన ‘రక్త చరిత్ర', ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి వివాదాస్పద చిత్రాలనే తెరకెక్కిస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘పవర్ స్టార్' అనే చిత్రాన్ని రూపొందించాడు.

సొంత ఫ్లాట్‌ఫాంలోనే సినిమా.. రెండూ ఒకే సారి

సొంత ఫ్లాట్‌ఫాంలోనే సినిమా.. రెండూ ఒకే సారి

కరోనా ప్రభావంతో సినిమా షూటింగులు బంద్ అవడంతో థియేటర్లు సైతం మూతపడ్డాయి. ఇలాంటి సమయంలో సరికొత్తగా ఆలోచించిన వర్మ ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' అనే ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించబోతున్నాడు. జూలై 25న 11 గంటలకు ‘పవర్ స్టార్' మూవీతో ఇది స్టార్ట్ అవుతుంది. పవన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

రెండింటికీ వ్యతిరేకత... స్పందన కూడా ఒకేలా

రెండింటికీ వ్యతిరేకత... స్పందన కూడా ఒకేలా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీన్ని ప్రధానాంశంగా తీసుకునే వర్మ ‘పవర్ స్టార్' చిత్రాన్ని రూపొందించాడు. కానీ, ఓ కల్పిత కథతో సినిమా తీసినట్లు చెబుతున్నాడు. దీంతో ఈ మూవీపై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, ఇటీవల విడుదలైన పాట, ట్రైలర్‌‌కు మాత్రం వ్యతిరేకత వ్యక్తమవగా.. వ్యూస్ పరంగా దూసుకెళ్లాయి.

పవన్‌ పర్సనల్ లైఫ్‌పై ఎటాక్.. అవే ఈ సీన్స్

పవన్‌ పర్సనల్ లైఫ్‌పై ఎటాక్.. అవే ఈ సీన్స్

ఈ సినిమాను ఊహాజనితమైన కథతో తెరకెక్కిస్తున్నట్లు రాంగోపాల్ వర్మ మొదటి నుంచీ చెబుతున్నాడు. కానీ, అందుకే భిన్నంగా దీన్ని తీశాడని ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో పవన్ కల్యాణ్ పర్సనల్ లైఫ్‌‌పై ఆయన ఎటాక్ చేశాడు. ఇందులో భాగంగానే కొన్ని కల్పిత సన్నివేశాలను జోడించాడని ప్రచారం జరుగుతోంది.

వర్మ ఆఫీస్‌పై దాడి... దర్శకుడిపై వాళ్లంతా ఫైర్

వర్మ ఆఫీస్‌పై దాడి... దర్శకుడిపై వాళ్లంతా ఫైర్

‘పవర్ స్టార్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో రాంగోపాల్ వర్మ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేశాడు. ఇందులో భాగంగానే పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆర్జీవీ ఆఫీసుపై కొందరు దాడి చేశారు. ఇదిలాఉండగా... పవన్ ఫ్యాన్స్‌ సోషల్ మీడియా వేదికగా వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్ మనసు మార్చేందుకు వర్మ ప్లాన్

తాను పవన్‌కు వీరాభిమానిని అని ఆర్జీవీ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ‘పవర్ స్టార్' ప్రమోషన్‌లో సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. కానీ, ఆయన్నే టార్గెట్ చేస్తూ సినిమా తెరకెక్కించడం చర్చనీయాశం అవుతోంది. ఈ మూవీ వల్ల దర్శకుడిపై మెగా ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో వర్మ ఓ అద్భుతమైన సీన్ క్రియేట్ చేశాడని ఓ వార్త లీకైంది.

‘పవర్ స్టార్‌'లో ఆ సీన్ ఓపీనియన్ మారుస్తుందా

‘పవర్ స్టార్‌'లో ఆ సీన్ ఓపీనియన్ మారుస్తుందా

తాజా సమాచారం ప్రకారం... ‘పవర్ స్టార్'లో క్లైమాక్స్ సీన్ పవన్ కల్యాణ్‌కు పాజిటివ్‌గా ఉంటుందట. ట్రైలర్‌లో చూపించిన అసలు రాజకీయాల్లో ఉండాలా.? వద్దా.? అని హీరో అనుకుంటున్న సమయంలో రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చి జనసేనానికి కొన్ని విలువైన సూచనలు చేస్తాడని తెలిసింది. అంతేకాదు, సినిమా చివర్లో ‘జై పవర్ స్టార్' అనే నినాదం కూడా ఇస్తాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X