Vikram, Jailer, Jawan... ఈ మూడు సినిమాలకు ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్, జైలర్, జవాన్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూడు సినిమాల్లో సీనియర్ హీరోలు.. బాక్సాఫీస్ పై దండయాత్ర చేశారు. కమల్ హాసన్ విక్రమ్, రజినీ కాంత్ జైలర్, షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలకు కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి నెట్టింట వైరల్ గా మారాయి. అసలు ఈ మూడు సినిమాలు ఏ కనెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. కమల్ హాసన్ కు మంచి కం బ్యాక్ సినిమాగా నిలిచింది. ఇక మరోవైపు సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతే కాదు.. రజినీ కాంత్ కు మంచి హిట్టును ఇచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా కూడా కాసుల వర్షం కురిపిస్తుంది.

విక్రమ్, జైలర్, జవాన్ సినిమాలకు కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి నెట్టింట వైరల్ గా చేస్తున్నారు. ఈ మూడు సినిమాలకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయని ఫ్యాన్స్ వైరల్ గా చేస్తున్నారు. ఇక ఈ మూడు సినిమాలను తమిళ కుర్ర దర్శకులే డైరెక్ట్ చేశారు. విక్రమ్ సినిమాను లోకేష్ కనగరాజ్ చేయగా... జైలర్ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఇక షారుఖ్ జవాన్ సినిమాను సైతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేశాడు.

ఇక విక్రమ్, జైలర్, జవాన్ సినిమాల్లోని ముగ్గురు హీరోలు సీనియర్. అంతే కాదు.. వీరు టైటిల్ రోల్స్ పోషించారు. ఇక ఈ మూవీల్లో కథనాయకులు గతంలో తనతో కలిసి పనిచేసిన వారి సాయం తీసుకుని తమకు వచ్చిన సమస్యను పరిష్కరించుకుంటారు. ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే... ఈ మూడు సినిమాల్లో తండ్రి కొడుకులు మధ్య కనెక్షన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
హీరోలకు మనవడితో కానీ, మనవరాలితో కానీ బాండింగ్ ఉండేలా కొన్ని సీన్లు రాసుకున్నారు మేకర్స్. అయితే జవాన్ విషయంలో కొంత తక్కువ. ఈ మూడు సినిమాలకి సంగీతం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ అందించారు. మరో కామన్ పాయింట్ ఏమిటంటే హీరోలందరూ గతంలో రక్షణ విభాగానికి చెందిన వ్యక్తులు గా పని చేస్తారు.

విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ ఒక స్పై కాగా జైలర్ సినిమాలో రజనీకాంత్ జైలర్ గా పని చేసి రిటైర్ అవుతాడు. జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ జవాన్ గా పని చేసి ఉంటాడు. ఈ మూడు సినిమాల్లో మలయాళ నటుడు జాఫర్ సాదిక్. ఆయన ఈ మూడు సినిమాలలోను కనిపిస్తాడు. ఈ సినిమాల్లో ఇతర హీరోల గెస్టు రోల్స్ సైతం హైలైట్ అయ్యాయి. విక్రమ్ సినిమాలో సూర్య, జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివా రాజకుమార్ గెస్ట్ రోల్స్ లో నటించారు. ఇక షారుఖ్ జవాన్ సినిమా విషయానికి వస్తే సంజయ్ దత్ గెస్ట్ రోల్ లో నటించారు.


Click it and Unblock the Notifications











