ఆ హీరో చెప్తే నవ్వుకున్నాం కానీ.. ఇప్పుడు కరోనా విజృంభణ చూసి!! వీడియో వైరల్
కొన్ని విషయాలు చేదుగా ఉంటాయి.. ఇంకొన్ని సందర్భాలు మితిమీరి ప్రవర్తిస్తున్నారా? అన్నట్లుగా అనిపిస్తుంటాయి. కానీ అదికాస్తా పీకల మీదికొచ్చాక దాని విలువేంటో అర్థమవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది హీరో శర్వానంద్ విషయంలో. అర్థం కాలేదా? అయితే మ్యాటర్ పూర్తిగా చదవండి క్లారిటీ వచ్చేస్తుంది.
మూడేళ్ల క్రితం మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో హీరో శర్వానంద్.. అతి శుభ్రత పాటించే వ్యక్తిగా నటించాడు. అది ఎలాంటి సందర్భమైన ముందు శుభ్రతకే ప్రయారిటీ ఇచ్చే క్యారెక్టర్ మనోడిది.
అయితే ఆ సీన్స్ చూసి.. కాస్త ఓవర్ చేశారు. మరీ ఇంత అవసరమా? అనుకున్నారు జనం. కానీ ఇప్పుడు అదే ప్రపంచమంతా పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ శుభ్రతకే ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

దీంతో 'మహానుభావుడు' మూవీ నుంచి కొన్ని సన్నివేశాలు తీసుకొని, వాటిని కరోనా జాగ్రత్తలతో ముడిపెడుతూ వీడియోలు రూపొందిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి అప్పుడు నవ్వినోళ్లే ఇప్పుడు మారుతి, శర్వానంద్ ముందుచూపుకు హాట్సాఫ్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











